అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా ??

|

Jan 22, 2024 | 7:04 PM

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలాగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చేస్తోంది. ఈ తరుణంలోనే చండీగఢ్ లో అయోధ్య రామాలయం ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. అంతదూరం వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి చేరుకొని శ్రీరాముని కృపాకటాక్షాలకు పాత్రులు అవుతున్నారు.

అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి ముహూర్తం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో దేశ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అలాగే బాలరాముని విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు యావత్ దేశం కోట్ల కన్నులతో ఎదురు చేస్తోంది. ఈ తరుణంలోనే చండీగఢ్ లో అయోధ్య రామాలయం ప్రతి రూపాన్ని ఏర్పాటు చేసి లక్షలాది లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. అంతదూరం వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి చేరుకొని శ్రీరాముని కృపాకటాక్షాలకు పాత్రులు అవుతున్నారు. ఈ ఆలయ గోపురం 80 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పుతో నిర్మించారు. శ్రీ రామ్ కృపా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణంలో కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ప్రస్తుతం దర్శననిమిత్తం వచ్చిన భక్తులకు లడ్డూలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలకు మొదటి కార్యక్రమం ప్రారంభమవుతుందని సేవా ట్రస్ట్ సభ్యుడు వెల్లడించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు..

చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..

చెత్తకుప్పలో వేలకొద్దీ ఆధార్‌, పాన్‌కార్డులు..

రష్మిక ‘డీప్‌ఫేక్‌’ కేసు నిందితుడు అరెస్టు !!

షోయబ్‌ మూడో పెళ్లి !! ఎవరీ సనా ?? అప్పుడు ఆయేషా, ఇప్పుడు సానియా

Follow us on