ఇలాంటి యాక్సిడెంట్‌ జరిగితే బతకడం కష్టమే.. కానీ వీళ్లకు ఎక్కడో సుడి ఉన్నట్టుంది

Updated on: May 09, 2025 | 11:06 AM

రాంగ్‌ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు.. ర్యాష్‌ డ్రైవింగ్‌తో పెద్ద వాహనాలను ఓవర్‌టేక్‌ చేయొద్దు అని చెబితే వింటారా.. వినరు. ఫలితం.. ఇదిగో ఇలా ప్రాణం మీదికి తెచ్చుకుంటారు. ర్యాష్‌ డ్రైవింగ్‌తో తమ ప్రాణాలనే కాదు ఇతరుల ప్రాణాలతో కూడా ప్రమాదంలో పడేస్తుంటారు. సోమవారం బెంగళూరులోని సర్జాపూర్ రోడ్డులో జరిగిన ఒక షాకింగ్ రోడ్డు ప్రమాదం నెటిజన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది.

బస్సు కింద చిక్కుకున్న ఇద్దరు బైకర్లు తృటిలో తప్పించుకున్న దృశ్యాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక రైడర్, అతని వెనక కూర్చున్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. ఆ ద్విచక్ర వాహనం ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ, నిరంతరం వాహనాలను ఓవర్‌టేక్ చేస్తూ స్పీడ్‌గా వెళుతూ కనిపించింది. తెల్లటి కారును ఓవర్‌టేక్ చేసిన తర్వాత, ముందున్న బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయాడు. అయితే అక్కడ బైకర్ పార్క్ చేసి ఉన్న ఓ మినీ వ్యాన్‌ను గమనించలేదు. వ్యాన్ ను దాటడానికి ప్రయత్నిస్తుండగా, బైక్ వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ముందు వెళుతున్న బస్సు చక్రాలను తృటిలో కొన్ని అంగుళాల మేర తప్పించుకున్నట్లు వీడియోలో ఉంది. అదృష్టవశాత్తూ, బస్సు చక్రాలను తప్పించుకోగా తృటిలో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన బైకర్లకు సహాయం చేయడానికి స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖతర్నాక్‌ పాము.. స్నేక్‌ క్యాచర్‌కే షాకిచ్చిందిగా

బెల్లం, సోంపు కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో పరార్‌

Avocado: మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే అద్భుత ప్రయోజనాలు