Special food for Cows: ఆవులకు స్పెషల్ విందు.. మ్యాంగో జ్యూస్‌తో సహా అదిరిపోయే మెనూ..
హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు.. గోవుని పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. అంతటి మహోన్నతమైన గోమాతకు
హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు.. గోవుని పూజిస్తే.. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెబుతారు. అంతటి మహోన్నతమైన గోమాతకు స్పెషల్ విందును ఏర్పాటు చేసి గౌరవించారు కొందరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..గుజరాత్ వడోదరలోని కజ్రాన్ మియాగం ప్రాంతంలోని పంజ్రపోల్లో కొంతమంది దాతలు ఆవులకు స్పెషల్ విందుని ఏర్పాటు చేశారు. రోజువారీ ఫుడ్ కాకుండా భిన్నంగా ఉండేలా ఆహారాన్ని ఏర్పాటు చేశారు . మామిడిపండ్ల జ్యూస్, డ్రై ఫ్రూట్స్ ను ఆవులకు అందించారు. గోవుల మందకు ఏకంగా తినడానికి ఆహారంగా 600 కేజీల డ్రైఫ్రూట్స్ ను .. దాహం తీర్చుకోవడానికి 800 కేజీల మ్యాంగో జ్యూస్‌ను అందించారు. మామిడి రసాన్ని ఓ నీటి తొట్టెలో వేశారు.. ఆవులు ఎంతో హుషారుగా చెంగు చెంగున పరుగెడుతూ.. వచ్చి.. నీటి తొట్టిలోని మామిడిపండ్ల రసాన్ని తాగాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆవు పాలలో విటమిన్ ఏతో పాటు, పోషక విలువలు అధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతారు. అంతేకాదు ఆవు పేడ మంచి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

