ఒక్క ఫోన్‌ కాల్‌తో ఆమె కోట్లకు పడగెత్తింది

Updated on: Oct 14, 2025 | 8:54 PM

తరచూ స్పామ్‌ కాల్స్‌ మనల్ని విసిగిస్తూ ఉంటాయి. ఏదో పనిలో మంచి బిజీగా ఉన్న టైంలో ఏదో అర్జంట్‌ కాల్‌ అన్నట్టుగా పదే పదే ఫోన్‌ రింగవుతుంటుంది. తీరా ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే అది స్పామ్‌ కాల్‌ అవుతుంది. ఆ టైమ్‌లో వచ్చే కోపం మామూలుగా ఉండదు. అయితే ఆ స్పామ్‌ కాలే ఓ మహిళకు ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రే ఆ వృద్ధురాలు కోటీశ్వరురాలైపోయింది.

అమెరికాలోని మిచిగాన్‌లో ఈ ఘటన జరిగింది. మిచిగాన్‌లోని వెస్ట్‌ల్యాండ్‌కు చెందిన వాలెరీ విలియమ్స్ అనే 65 ఏళ్ల మహిళ తరచూ లాటరీ టికెట్లు కొంటుంటారు. అలా కొన్న టికెట్లలో బహుమతి రాని టికెట్లను మిచిగాన్ లాటరీ యాప్‌లో స్కాన్ చేస్తూ ఉండేవారు. అయితే, అలా స్కాన్ చేసిన ప్రతి టికెట్ ఆటోమేటిక్‌గా సెకండ్ ఛాన్స్ డ్రాకు వెళుతుందన్న విషయం ఆమెకు తెలియదు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు లాటరీ ఆఫీస్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను లాటరీలో ఒక మిలియన్‌ డాలర్లు అంటే రూ. 8.8 కోట్లు గెలుచుకున్నట్లు చెప్పారు. ఆ ఫోన్‌ కాల్ ను ఆమె మొదట నమ్మలేదు. మిచిగాన్ లాటరీ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పగానే, ఇది ఏదో స్కామ్ అయి ఉంటుందని భావించి మొదట పట్టించుకోలేదు. ఆ తర్వాత…సరే, ఏం చెబుతారో చూద్దామని ఫోన్ ఆన్సర్‌ చేసింది. నిజంగానే తాను 1 మిలియన్ డాలర్ల ఎలక్ట్రిక్ గివ్‌అవే పోటీకి ఎంపికయినట్లు తెలిసి షాక్ అయ్యానని వాలెరీ తెలిపారు. ఆ తర్వాత సెప్టెంబర్ 19న డెట్రాయిట్‌లోని కొమెరికా పార్క్‌లో ప్రైజ్ వీల్ తిప్పేందుకు ఆమెను ఆహ్వానించారని, ఆ చక్రం తిరుగుతున్నప్పుడు తనకు చాలా ఉత్కంఠగా అనిపించిందని, చివరికి అది తాను ఎంచుకున్న రంగుపై ఆగడంతో నమ్మలేకపోయానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ గెలుపుపై లాటరీ కమిషనర్ సుజాన్నా ష్రెలీ మాట్లాడుతూ.. వాలెరీ విలియమ్స్‌కు అభినందనలు తెలిపారు. సెకండ్ ఛాన్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వినియోగ‌దారుల‌కు సూచించారు. ఇక‌, తాను గెలుచుకున్న డబ్బును ప్రస్తుతానికి దాచుకుంటానని, త్వరలోనే తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు వాలెరీ వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలోనే అతి పెద్ద విమానం శంషాబాద్‌లో ల్యాండింగ్

ఉరివేసుకొని ప్రాణం తీసుకోబోయిన మహిళ.. కట్ చేస్తే..

విద్యార్ధులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

సల్మాన్‌తో దిల్ రాజు బిగ్‌ ప్రాజెక్ట్‌.. డైరెక్టర్ ఎవరో తెలుసా

ట్రైన్‌లో సీటు దొరకలేదని ఆ మహిళ ఏం చేసిందో చూడండి