తనను కాపాడిన యువకులకు లంచ్ ఆఫర్ చేసిన యూట్యూబర్.. ఇద్దరు భారతీయ హీరోలను కలుసుకున్నా అంటూ ట్వీట్
ముంబైలో ఇద్దరు యువకులు దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుండగా ఆమెపై దాడి చేశారు. మహిళను చేయిపట్టుకొని లాక్కెళ్తూ వేధింపులకు పాల్పడ్డారు.
ముంబైలో ఇద్దరు యువకులు దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తుండగా ఆమెపై దాడి చేశారు. మహిళను చేయిపట్టుకొని లాక్కెళ్తూ వేధింపులకు పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో సదరు మహిళ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా ఈ ఘటనలో ఆ మహిళకు ఓ ఇద్దరు ఇండియన్ యువకులు సహాయం చేసారు. ఆ దుండగుల బారినుంచి ఆమెను కాపాడటమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో కూడా ఆమెకు సాయపడ్డారు. దాంతో తాజాగా ఆమె తనను కాపాడిన ఇద్దరు యువకులకు థ్యాంక్స్ చెప్తూ సోషల్‌మీడియాలో కొన్ని ఫొటోలు, ఒక వీడియో పోస్ట్ చేసింది. ఆమె వాళ్లతో కలిసి లంచ్ చేస్తున్న ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Dec 10, 2022 09:15 AM
వైరల్ వీడియోలు
Latest Videos