Gold: షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!

|

Dec 19, 2024 | 10:26 AM

బంగారం అంటే ఇష్టపడని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు. సామాన్యులు మొదలుకొని, ధనవంతుల వరకూ అమితంగా ఇష్టపడే వాటిలో బంగారం ముందు వరుసలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ బంగారాన్ని స్టేటస్‌కి సింబల్‌గా భావిస్తుంటారు. అందులో ధర పెరుగుతున్నా లెక్కచేయకుండా ఎడాపెడా కొనేస్తుంటారు. అయితే ఈ డిమాండ్‌ను కొందరు క్యాష్ చేసుకుంటుంటారు.

దుకాణంలో కొన్నా, నగలపై హాల్‌మార్క్ ముంద్రించి ఉన్నా కూడా అసలు బంగారు అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తి బంగారు ఆభరణాన్ని చిన్న టెక్నిక్‌‌తో ఎలా తేల్చేశాడో చూస్తే షాకవుతారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బంగారు వస్తువును పరీక్షిస్తుంటాడు. అది చూసేందుకు ఒరిజినల్ బంగారం లాగే ఉంటుంది. దానిపై హాల్‌మార్క్ కూడా ముద్రించి ఉంటుంది. అయినా దాన్ని పరీక్షించాలని నిర్ణయించుకుంటాడు. ముందుగా దాన్ని తీసుకుని ఓ రాయిపై రద్దుతాడు. ఆ తర్వాత దానిపై జెల్ వంటి పదార్థాన్ని పోస్తాడు. ఇలా చివరకు ఆ బంగారు వస్తువు నకిలీదిగా తేల్చేస్తాడు. అసలు బంగారం ఎంత రుద్దినా రంగు పోదని ఆ వ్యక్తి తెలిపాడు. ఇత్తడి వస్తువులపై బంగారు పూత పూసి ఇలా మోసం చేస్తున్నారని చెప్పాడు.

చాలా మంది 5% మేకింగ్ చార్జీలు అనగానే ముందూ, వెనుకా చూడకుండా కొనేస్తుంటారని.. అలా చేయడం వల్ల ఇలా మోసాలు జరిగే అవకాశం ఉందని చెప్పాడు. గుర్తింపు పొందిన దుకాణాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని సూచించాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.