Solar Snake: భగభగ మండే సూర్యుడిపై జరజర పాకుతున్న పాము
సూర్యునిపై అద్భుత దృశ్యం ఒకటి కనిపించింది. సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజర పాకుతూ వెళ్తున్న దృశ్యం కనువిందు చేసింది.
సూర్యునిపై అద్భుత దృశ్యం ఒకటి కనిపించింది. సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజర పాకుతూ వెళ్తున్న దృశ్యం కనువిందు చేసింది. ఏంటి సూర్యున్ని ఓరకంట చూడ్డం కూడా సాధ్యం కాదు, అలాంటిది సూర్యుడిపైన పాము కనిపించడమేంటి అనుకుంటున్నారా… అవును.. యూరోపియన్ ఆర్బిటర్ ద్వారా సూర్యునిపై ఈ విచిత్రమైన ఘటన కనిపించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఐతే అది సూర్యుని అయస్కాంత క్షేతం గుండా వెళ్తున్న చల్లటి వాతావరణ వాయువుల గొట్టంగా పేర్కొంది. అది చూడటానికి అచ్చం భగభగమండే సూర్యుని ఉపరితలంపై పాకుతున్న పాములా కనిపిస్తోంది. కాగా దీన్ని పాము రూపంలో ఉన్న ప్లాస్మా అని, అది సూర్యునిపై ఒక వైపు నుంచి మరోవైపుకు అయస్కాంత క్షేత్రం ఫిలమెంట్‌ను అనుసరిస్తుందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అక్టోబర్ 12న సోలార్ ఆర్బిటర్ సూర్యుని వైపు ప్రయాణించినప్పుడు ఈ అరుదైన దృశ్యం చూడగలిగామని ముల్లార్డ్ స్పేస్ సైన్స్ లాబోరేటరీ శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్
ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..
Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!
