Blood Donor: 21 వేల కి.మీ పాదయాత్ర.!ఎందుకోసమో తెలుసా.? వీడియో వైరల్..

|

Dec 04, 2023 | 10:26 PM

ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై అవగాహన కల్పించడానికి 21 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. 2021 డిసెంబర్ 28న కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇటీవల నాగాలాండ్​లోని కోహిమా జిల్లాకు చేరుకుంది. అక్కడి పర్యాటక మంత్రి తేంజెన్‌ ఇమ్నాతో కలిసి తీసుకున్న ఫొటోను తన సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో షేర్‌ చేశారు. 2025 డిసెంబరు 31 నాటికి 21 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలన్నదే కిరణ్ వర్మ లక్ష్యం.

ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై అవగాహన కల్పించడానికి 21 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. 2021 డిసెంబర్ 28న కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర ఇటీవల నాగాలాండ్​లోని కోహిమా జిల్లాకు చేరుకుంది. అక్కడి పర్యాటక మంత్రి తేంజెన్‌ ఇమ్నాతో కలిసి తీసుకున్న ఫొటోను తన సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో షేర్‌ చేశారు. 2025 డిసెంబరు 31 నాటికి 21 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలన్నదే కిరణ్ వర్మ లక్ష్యం. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ప్లకార్డును చేతిలో పట్టుకుని సుమారు 229 జిల్లాల్లో ఇప్పటివరకు 17,700 కిలోమీటర్లు నడిచారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలు కాపాడమని ప్రజలను కోరుతున్నారు. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కొత్తవారిని రక్తం దానం చేసేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కిరణ్​ వర్శ. 2025 డిసెంబర్ 31 తర్వాత రక్తం కోసం ఎదురుచూస్తూ ఎవరూ చనిపోకూడదని సూచిస్తున్నారు.

రక్తదానంపై అవగాహనకు ఎక్కువ దూరం పాదయాత్ర చేసిన వ్యక్తిగా రికార్డుకెక్కాలని కిరణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈయన చేసిన పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. కిరణ్​కు మద్దతుగా దేశవ్యాప్తంగా 126 రక్తదాన శిబిరాలు నిర్వహించి 26,722 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ప్రజల దగ్గర నుంచి స్పందన బాగానే వస్తోందని ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ రక్తదాన శిబిరాలను నిర్వహించినట్లు కిరణ్‌ వర్మ చెప్పుకొచ్చారు. సుమారు 30 వేల మంది రక్తదానం చేశారనీ 10 వేల మందికి పైగా ప్రజలు నేరుగా బ్లడ్ బ్యాంక్​కు వెళ్లి రక్తదానం చేశారనీ అన్నారు. తాను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ప్రజలను కలిశాననీ ఈ పాదయాత్ర పూర్తయ్యే సరికి భారతదేశంలో 10 కోట్ల మంది ప్రజలను కలుసుకుంటాననీ గర్వంగా అన్నారు. కనీసం 50 లక్షల మంది కొత్త దాతలను ప్రోత్సహించాలని, బ్లడ్​ బ్యాంకులు, ఆస్పత్రుల్లో రక్తం కొరత అనేది లేకుండా చేయాలని కిరణ్​ లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలో మణిపుర్, మిజోరం, త్రిపుర సహా ఈశాన్య ప్రాంతాల్లో పాదయాత్ర చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.