మంచు దుప్పటి కప్పుకున్న మన్యం జిల్లా.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

|

Dec 18, 2023 | 7:22 PM

మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మేయడంతో రహదారుల్లో వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. బారెడు పొద్దెక్కినా సూర్యుడి జాడ కనిపించడంలేదు.

మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది. చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడిపోతున్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మేయడంతో రహదారుల్లో వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. బారెడు పొద్దెక్కినా సూర్యుడి జాడ కనిపించడంలేదు. దీంతో జనాలు బయటకు రావాలంటే భయడపడుతున్నారు. పాడేరు ఏజెన్సీలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి… పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అరకులో 13, చింతపల్లిలో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముంచంగిపుట్టులో చలి తీవ్రతకు జనం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది. దీంతో కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన్యంలో సాయంత్రం నాలుగు గంటల నుంచే వీధుల్లో చలి మంటలు దర్శనమిస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతన్నలను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు