కొబ్బరికాయల రాసి నుంచి వింత శబ్దాలు.. అక్కడ చూసేసరికీ త్రాచుపాము బుసబుసలు.. చివరకు
అసలే వర్షాకాలం.. ఈ సీజన్ లో పాముల బెడద ఎక్కువ. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటున ఏ పురుగు దాగుందో తెలియని పరిస్థితులు నెలకొనే కాలం. అందుకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాములతో సమస్యలు తప్పవు. మరీ ముఖ్యంగా పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచుపాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది. కొబ్బరి ఒలిచే కార్మికులను పరుగులు పెట్టించింది. అల్లవరంలో కొబ్బరి రాసులో చేరిన తాచుపాము కార్మికులను హడలెత్తించింది. కొబ్బరి రాసి వద్ద కొబ్బరి కాయలు ఒలుస్తున్న కార్మికులకు వింత శబ్దాలు వినపడ్డాయి. అనుమానంతో కొబ్బరి రాసిని చెక్ చేసేసరికీ ఆ కార్మికులకు తాచుపాము కనిపించింది. తాచుపామును చూసిన కార్మికులు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు. శంకర్ కు చెందిన కొబ్బరి తోటలో ఈ దృశ్యం కనిపించింది. అయితే పాము అప్పటికే ఎలుకను తిన్నట్లు గుర్తించారు. కార్మికుల అలికిడికి తాచుపాము పడగవిప్పి బుసలు కొట్టింది. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. దీంతో వర్మ అక్కడికి చేరుకుని సుమారు ఆరడుగుల పామును బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు. కొబ్బరి కాయలు నిల్వ ఉంచే చోట ఎలుకలు, కప్పలు ఉండడంతో వాటిని తినడానికి పాములు చేరతాయని కార్మికులు అప్రమత్తంగా ఉంటూ పనులు చేసుకోవాలని స్నేక్ క్యాచర్ వర్మ సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లో అందరూ ఒకే సబ్బు వాడుతున్నారా
చేయి పట్టి పైకి లాగారు.. అంతే.. స్టెప్పులతో ఇరగదీసింది
ఆ ఊరిలో 60 ఏళ్ళు దాటిన వ్యక్తి ఒక్కరూ బతికి లేరు.. అదే కారణమా?
ఇళ్లకు తాళాలు వేయరు.. క్రైమ్ రేట్ చాలా తక్కువ.. ఎక్కడంటే..?
సెల్ఫీ పిచ్చి ఎంత పని చేసింది.. ఎందుకు స్వామి వీళ్ళు ఇలా అయిపోతున్నారు