AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్‌లో వలపు వల.. తేరుకునేలోపే రూ.15 లక్షలు వీడియో

ఫేస్‌బుక్‌లో వలపు వల.. తేరుకునేలోపే రూ.15 లక్షలు వీడియో

Samatha J
|

Updated on: Aug 02, 2025 | 1:50 PM

Share

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నంలో సైబర్ నేరస్తులు ఓ వ్యక్తిని మహిళ ఫోటోలతో నట్టేట ముంచేశారు.. ఫేస్‌బుక్‌లో పరిచయమై.. వాట్సాప్‌లో చాటింగ్ మొదలు పెట్టింది. ప్రేమగా మాట్లాడుతూ వల విసిరింది.. అబ్బాయిని ధనవంతుడిని చేస్తానని నమ్మబలికింది. ఫోన్ పే ద్వారా 10 లక్షలు, బ్యాంకు ఆర్‌టీజీఎస్‌ ద్వారా మరో 4లక్షల 95వేల రూపాయలను స్టేట్ బ్యాంకు ద్వారా పంపించాడు.

ఆమె అడగ్గానే ఫోన్ పేలో మొదట 50 వేల రూపాయలు పంపించాడు బాధితుడు. పలు దఫాలుగా మొత్తం 14లక్షల 95వేల135 రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేశారు. అతని ఖాతాలో 59 వేల 93 డాలర్స్ క్రెడిట్ అయినట్టు ఆమె చూపించింది. ఆ మొత్తాన్ని తన ఖాతాకు జమ చేయమని అతను కోరాడు. సదరు ఖాతా ఫ్రీజ్ అయిందని ఆమె నమ్మించేందుకు ప్రయత్నించింది. మరో 20 లక్షల రూపాయలు చెల్లించమని డిమాండ్ చేసింది. అనంతరం అతని నెంబరును ఆమె బ్లాక్ చేసింది. దీంతో మోసపోయినట్టు గుర్తించిన యువకుడు పోలీసులను ఆశ్రయించారు. మరో 20 లక్షలకు మహిళ టోకరా వేయబోవడంతో మేలుకున్న బాధితుడు మోసపోయానని గుర్తించి రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. తనకు నమ్మకం వచ్చేలా తన ఫోటోలు అంటూ పంపి బాధితుడిని ముంచేసింది.. డాలర్ రూపంలో పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభాలు వస్తే, స్థిరపడతామన్న ఆలోచనతో అమౌంట్ వేసానని, ఇదంతా మోసమని గ్రహించలేకపోనని బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌ పోలీసులను, రాజానగరం పోలీసులను అశ్రయించానని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు కూడా తన బాధను మెయిల్ ద్వారా తెలియజేశానని బాధితుడు వెల్లడించాడు.

మరిన్ని వీడియోల కోసం :

నీ కష్టం పగోడికి కూడా రావద్దు బ్రో .. వైరల్ అవుతున్న వీడియో

ఇదెక్కడి ఆచారం.. ఆ దుమ్ము,ధూళితో రోగాలన్నీ మాయం వీడియో

రేయ్ ఎంత పని చేసార్రా.. గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెనా? వీడియో