రేయ్ ఎంత పని చేసార్రా.. గబ్బిలాల మాంసంతో చిల్లీ చికెనా? వీడియో
ఫాస్ట్‌ఫుడ్ ప్రియులకు వెన్నులో వణుకు పుట్టించే వార్త . మీరు ముక్కు తుడుచుకుంటూ, లొట్టలేసుకుంటూ తిన్నది ‘చిల్లీ చికెన్’ కాకపోవచ్చు. ఎందుకంటే.. చికెన్ పేరిట గబ్బిలాల మాంసాన్ని హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు చేరవేసే ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు సేలం జిల్లా డేనిష్ పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కమల్, సెల్వం.. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలను చెప్పారు.
కొన్ని నెలలుగా గబ్బిలాలను వేటాడుతున్న వీళ్లిద్దరూ.. వాటిని చంపి ఆ మాంసాన్ని చికెన్ పేరిట హోటల్స్‌కు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సప్లై చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని హోటల్స్‌కు చిల్లీ చికెన్‌ను వీళ్లే స్వయంగా గబ్బిలాల మాంసంతో వండించి నేరుగా సప్లై చేసారట. తమ కంటే ముందు కొంతమంది.. కొన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నారంటూ మరో బాంబ్ పేల్చారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులను అప్రమత్తం చేశారు. సేలం, కమల్ సమాచారంతో సేలం జిల్లాలోని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇంతకాలం పిల్లి, కుక్క, ఎలుకల మాంసాన్ని ఇలా తరలించడం చూశాం. ఇప్పుడు ఏకంగా గబ్బిలాల మాంసాన్ని చేరవేస్తుండటం ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
మీ గుట్టురట్టు చేసే wifi వచ్చిందోచ్ వీడియో
డెలివరీ బోయ్స్‌గా షాపులోకి ఎంట్రీ.. కట్‌చేస్తే
అదృష్టమంటే ఇదే.. ఒకేసారి 8 వజ్రాలు దొరికాయ్ వీడియో
అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి వీడియో
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

