ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరోసారి నాగుపాము ప్రత్యక్షమై భక్తుల్లో ఆందోళన కలిగించింది. పార్వతిపురం ధర్మశాల కార్యాలయంలో కనిపించిన పామును స్నేక్ క్యాచర్ సురక్షితంగా పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టారు. శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద కూడా పాముల సంచారం అధికమైంది. భక్తుల భద్రతకు, ఆలయ పరిసరాల పరిశుభ్రతకు దేవస్థానం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మరోసారి నాగుపాము ప్రత్యక్షమై భక్తులను, సిబ్బందిని భయాందోళనకు గురి చేసింది. నిత్యం వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే ఈ ఆలయ పరిసరాల్లో పాముల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా పార్వతిపురం ధర్మశాల కార్యాలయంలో అకస్మాత్తుగా నాగుపాము కనిపించడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా భయపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన దేవస్థానం అధికారులు స్నేక్ క్యాచర్‌ను సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ నాగుపామును సురక్షితంగా బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో కూడా గత కొంతకాలంగా తరచూ పాములు దర్శనమిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయ, సాయంత్రం వేళల్లో భక్తుల రాకపోకలు అధికంగా ఉండే సమయంలో పాములు కనిపించడంతో భయాందోళన నెలకొంటోంది. ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత వల్ల పాములు బయటకు రావడానికి కారణమవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు పరిశుభ్రత చర్యలు మరింత కఠినంగా చేపట్టాలని, పాములు రాకుండా ప్రత్యేక నివారణ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల భద్రతే లక్ష్యంగా దేవస్థానం పరిధిలో నిరంతర పర్యవేక్షణ, స్నేక్ క్యాచర్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..
బాబోయ్ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి
సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే
నడిరోడ్డుపై యువకుడికి క్లాస్ తీసుకున్న మంత్రి
ఆ బ్యాంక్ వింత రూల్.. బ్యాంకులో డబ్బు పెడితే మీరే వడ్డీ కట్టాలి