నవదుర్గా ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం

|

Oct 16, 2023 | 6:56 PM

శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే వేళ దుర్గా అలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అక్టోబరు 14న మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా రాజాం నవదుర్గ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ తలుపులు తెరవగానే ఎదురుగా పాము ప్రత్యక్షమైందని ఆలయ పూజారి తెలిపారు. పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సుమారు ఏడు అడుగుల పొడవున్న ఆ నాగుపాము రెండు గంటలపాటు ఆలయ ప్రాంగణంలో..

శరన్నవరాత్రులు ప్రారంభమయ్యే వేళ దుర్గా అలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అక్టోబరు 14న మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా రాజాం నవదుర్గ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ తలుపులు తెరవగానే ఎదురుగా పాము ప్రత్యక్షమైందని ఆలయ పూజారి తెలిపారు. పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. సుమారు ఏడు అడుగుల పొడవున్న ఆ నాగుపాము రెండు గంటలపాటు ఆలయ ప్రాంగణంలో నే ఉందని, అయితే భక్తులకు ఎలాంటి హానీ తలపెట్టలేదని పూజారి చెప్పారు. శరన్నవరాత్రులు ప్రారంభవేళ ఇలా అమ్మవారి సన్నిధిలో పాము కనిపించడంతో పరమేశ్వరుడి ఆశీర్వాదంగా భావిస్తున్నారు భక్తులు. ఇంతలో ఆలయ ఛైర్మన్‌ స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమివ్వడంతో ఆయన వచ్చి నాగుపామును బంధించి తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేపచెట్టునుంచి ధారలా వస్తున్న పాలు !! దైవ ఘటనే అంటూ పూజలు

రూ. 3 కోట్ల జాబ్ ను వ‌దులుకున్న టెకీ !! కార‌ణం ఏంటంటే ??

నాగుపాముతో యువకుడి ఆటలు.. ఇలాంటి సాహసాలు చేయొద్దంటున్న నెటిజన్లు

నాడు సాధారణ ఉద్యోగి.. నేడు అత్యంత సంపన్నురాలు

కుక్కతో కంగారు ఫ్రెండ్ షిప్ !! నెటిజన్ల మనసుదోస్తున్న వీడియో

 

 

Follow us on