బైకు సర్వీసింగ్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. ఏంటా అని చూసిన మెకానిక్‌ షాక్‌..

|

Jul 08, 2024 | 9:31 PM

వర్షాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలు ఇప్పడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు పశుపక్ష్యాదులు కూడా సేదదీరుతున్నాయి. ఈ క్రమంలో పుట్టల్లో, అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పాములు వర్షాల కారణంగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇళ్లలో చేరి నాగుపాములు ప్రజలను భయాందోళనకు గురిచేసాయి.

వర్షాలు మొదలయ్యాయి. ఇన్నాళ్లూ అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన ప్రజలు ఇప్పడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు పశుపక్ష్యాదులు కూడా సేదదీరుతున్నాయి. ఈ క్రమంలో పుట్టల్లో, అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పాములు వర్షాల కారణంగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇళ్లలో చేరి నాగుపాములు ప్రజలను భయాందోళనకు గురిచేసాయి. తాజాగా అదే జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. గోకవరం లో ఓ బైక్ మెకానిక్‌ బైక్‌ రిపేరు చేస్తుండగా ఓ నాగుపాము హెడ్ లాంప్ లో లైట్ కు చుట్టుకుని మెకానిక్ కంటపడింది.. దింతో బెంబేలెత్తిన మెకానిక్ ఒక్కసారిగా భయం తో బైక్ ను కింద పడేసి పరుగు తీసాడు . అటుగా వెళ్తున్న స్థానిక యువకులు పామును బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసారు. అయినా పాము బయటకు రాలేదు. సాయంత్రం కావడం తో ఎంతసేపటికి బయటకు రాకపోవడం తో అందరు ఆగమాగం అయ్యారు.. చివరికి ఓ యువకుడు ధైర్యం చేసి చేతితో పాము తోక పట్టుకుని బయటకు లాగాడు. దీంతో ఒక్కసారిగా బయటకు వచ్చిన పామును చూసి అక్కడున్నవారంతా పరుగులు తీశారు. మరికొందరు వీడియోలు తీస్తూ, పామును చూస్తూ ఉండిపోయారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిని దోచేసి.. క్షమించమని లెటర్‌ రాసి వెళ్లిన దొంగ !!

ఉద్యోగుల జీతాలు పెంచిన యజమానులకు మూడేళ్లు జైలు..

1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం !!

జాలర్లకు చిక్కిన భారీ చేప.. కొనేందుకు ఎగబడిన జనం.. ఎందుకంటే ??