Cobra Snake In Toilet: టాయ్‌లెట్‌కి వెళ్లిన టూరిస్ట్‌పై కాలనాగు దాడి.. కాటు ఎక్కడ వేసిందంటే..? (వీడియో)

|

Nov 25, 2021 | 9:56 AM

విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. టాయ్‌లెట్‌కి వెళ్లిన ఆ వ్యక్తిపై పాము దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలపై కాటేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది.


విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. టాయ్‌లెట్‌కి వెళ్లిన ఆ వ్యక్తిపై పాము దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలపై కాటేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. యూరాలజీ కేస్ రిపోర్ట్స్ కథనం ప్రకారం.. 47 ఏళ్ల ఓ వ్యక్తి దక్షిణాఫ్రికాలో విహారయాత్ర కోసం వెళ్లాడు. ఈ క్రమంలో టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు.. అంతకుముందు బేసిన్‌లో ఉన్న పాము.. ప్రైవేట్ భాగాలపై కాటేసింది. టాయిలెట్ బౌల్‌లో అప్పటికే ఉన్న నాగుపాము.. అతనిపై ఒక్కసారిగా దాడి చేసినట్లు వెల్లడించింది. దీంతో అతను స్క్రోటల్ నెక్రోసిస్‌తో బాధపడ్డాడని అధ్యయనం తెలిపింది.

బాధితుడు కాటుకు గురైన అనంతరం జననాంగంలో మంట, నొప్పి, వాంతులతో బాధపడ్డాడని, ఈ నొప్పి ఛాతీ, ఉదరం వరకు వ్యాపించిందని అధ్యయనంలో తేలింది. మెడికల్ జర్నల్ ప్రకారం.. అతను దక్షిణాఫ్రికాలో సర్జికల్ డీబ్రిడ్మెంట్, నెదర్లాండ్స్‌లో పెనైల్ షాఫ్ట్ డీబ్రిడ్మెంట్ వంటి వైద్యాన్ని తీసుకొని ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ చికిత్సకు పాము విష యాంటిసెరమ్, బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే.. కొన్ని సందర్భాల్లో సర్జికల్ డీబ్రిడ్మెంట్ శ్వాసకోశ వైఫల్యానికి కారణమవుతుందని జర్నల్ వివరించింది. కాగా ఇలాంటి కేసులు తరచూ వస్తున్న నేపథ్యంలో పలు దేశాలు సూచనలు కూడా చేస్తున్నాయి. పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఎల్లప్పుడూ టాయిలెట్‌ను ఫ్లష్ చేసిన తర్వాత ఉపయోగించాలంటూ సూచిస్తున్నాయి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Icon Star Allu Arjun Pushpa: సోషల్ మీడియాలో పుష్పరాజ్ సందడి.. ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప లుక్స్..

jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..

Balakrishna Trending looks: సోషల్ మీడియాలో సింహ గర్జన.. బాలయ్య న్యూ మూవీ లుక్.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్..

Follow us on