Viral Video: వేదికపై ప్రసంగిస్తూనే ప్రాణాలు వదిలిన స్వామీజీ.. విషాదంలో భక్తులు.. వైరల్ అవుతున్న వీడియో..
తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే ఓ స్వామీజీ ప్రాణాలు విడిచారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి...
తన జన్మదిన వేడుకలకు హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూనే ఓ స్వామీజీ ప్రాణాలు విడిచారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన జన్మదిన వేడులకు హాజరైన భక్తులను ఉద్దేశించి బలోబల మఠం పీఠాధిపతి సంగనబసవ మహాస్వామీజీ ప్రసంగం ప్రారంభించారు. అలా మాట్లాడుతున్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన ప్రసంగం ఆపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.అలా కూర్చున్న స్వామీజీ కుర్చీలోనే తల వెనక్కి వాల్చి కన్నుమూశారు. పక్కనే ఉన్న స్వామీజీ, భక్తులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందారు. స్వామీజీ ప్రసంగాన్ని భక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేసుకుంటున్నారు. దాంతో ఈ దృశ్యం కూడా రికార్డు కాగా, తాజాగా అది సోషల్ మీడియాలో చేరింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

