Gold Smuggling: బూట్లలో కోట్ల ఖరీదైన బంగారం.. ఎలా పట్టుకున్నారంటే.!
అధికారుల కళ్లు గప్పి స్మగ్లర్ల అక్రమ దందా అంతర్జాతీయ మార్కెట్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చవకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు.
అధికారుల కళ్లు గప్పి స్మగ్లర్ల అక్రమ దందా అంతర్జాతీయ మార్కెట్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో చవకగా దొరికే బంగారాన్ని వివిధ మార్గాల్లో స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. తాజాగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఎయిర్ పోర్టు అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా షూలో దాదాపు ఒకటిన్నర కేజీల బంగారాన్ని దాచేశాడు. అయితే అతగాడి నడక, వ్యవహారంలో ఏదో తేడా కొట్టింది. అది గమనించిన అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా బూట్లలో బంగారం గుట్టు రట్టయింది. ఈ సంఘటన హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చిన ఓ వ్యక్తిని శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ అరెస్టు చేసింది. EK-528 విమానంలో అంతర్జాతీయ అరైవల్ హాల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సదరు ప్రయాణికుడి బూట్లు, వీపునకు తగిలించుకునే సామాన్ల బ్యాగ్‌ను అధికారులు స్కాన్ చేయగా దాదాపు కిలోన్నర బంగారం బయటపడింది. బ్యాటరీ ఆకారంలో ఉన్న రెండు పసుపు రంగు పెద్ద మెటల్ బార్‌లు నిందితుడి ఎడమ కాలి షూలో, బ్యాక్ ప్యాక్ బ్యాగ్‌లో దాచాడు. అలాగే పసుపు రంగులో ఉన్న ఓ మెటల్ గొలుసును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1390.850 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.06 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. కస్టమ్స్ యాక్ట్ 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.