Tungabhadra Dam: డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి.. కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.!
కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకి వస్తోంది. ఇటీవలి వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం వరద తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు.
కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ గేటు ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకి వస్తోంది. ఇటీవలి వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం వరద తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. దీంతో 35 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోయిందని చెప్పారు. 69 ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్‌టైమ్ ప్రమాదం జరిగింది. వరద పోటెత్తడంతో 19వ గేట్ కొట్టుకుపోయింది. రాత్రి 11గంటల సమయంలో గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు.
డ్యామ్ గేటు ఊడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ప్రభావం ఉండవచ్చని పేర్కొంది. గేటును పునరుద్ధరించే పనిలో పడ్డారు అధికారులు. డ్యామ్ లో నుంచి 60 టీఎంసీల నీటిని బయటకు పంపాక గేటును అమర్చుతామని ప్రకటించారు. కాగా, డ్యామ్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసి కర్ణాటక మంత్రి శివరాజ్ ఆదివారం ఉదయం తుంగభద్ర డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు.
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డ్యామ్ వద్దకెళ్లి అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యామ్ గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యామ్ అధికారులతో మాట్లాడాలని, అందుకు అవసరమైన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఆదేశించారు. అయితే, వరద ఉధృతి తగ్గితేనే గేట్ రిపేర్ సాధ్యం అంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతానికి, మిగతా గేట్లకు.. డ్యామ్‌కు ఎలాంటి సమస్యా లేదని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

