ఈ పొరపాట్లు చేస్తున్నారా ?? ఫ్లైట్‌ మిస్‌ అవుతుంది జాగ్రత్త !!

Updated on: Nov 29, 2025 | 11:47 AM

విమాన ప్రయాణం ఇప్పుడు సర్వసాధారణం. అయితే చాలామంది ప్రయాణికులు అనుకోకుండా చేసే కొన్ని తప్పుల వల్ల వారి ప్రయాణం ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటివి జరగకుండా, ప్రయాణం సజావుగా సాగాలంటే సరైన ప్రణాళిక, జాగ్రత్తలు అవసరం. సమయానికి ఎయిర్‌పోర్ట్ చేరుకోవడం, ఆన్‌లైన్ చెక్-ఇన్ చేసుకోవడం, ఫోన్‌లో అప్‌డేట్‌లను గమనించడం వంటివి గుర్తుంచుకోవాలి.

విమాన ప్రయాణం అనేది ఈ మధ్య సర్వ సాధారణం అయిపోయింది. జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనేది కొంతమంది కల. పైనుంచి విమానం వెళుతుంటే దాని దిక్కు ఆశగా చూస్తుంటారు. ఇక బిజినెస్‌ మ్యాన్‌లు, కొన్ని రకాల జాబ్‌ చేసేవారు తరచుగా విమానాల్లో ప్రయాణిస్తూనే ఉంటారు. దూర ప్రాంతాలకు త్వరగా వెళ్లాలంటే విమాన ప్రయాణానికి మించి వేరే దారి లేదు. చాలా తక్కువ సమయంలోనే చాలా దూరం సులభంగా చేరుకోవచ్చు. అయితే, చాలా మంది ప్రయాణికులు అనుకోకుండా చేసే కొన్ని తప్పుల వల్ల వారి మొత్తం ప్రయాణం డిస్టర్బ్‌ అవుతుంది. అందువల్ల, విమాన ప్రయాణం చేయాలనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు. విమానంలో ప్రయాణించాలనుకుంటే ఎయిర్‌పోర్టు‌కు ఆలస్యంగా మాత్రం వెళ్లకూడదంటున్నారు. విమానానికి గంట ముందు వచ్చినా సరిపోతుందనుకుని చాలా మంది ఫ్లైట్‌ మిస్ అవుతారు. దేశీయ ప్రయాణం చేస్తున్నట్లయితే కనీసం 2 గంటల ముందు, అంతర్జాతీయ ప్రయాణమైతే కనీసం 3 గంటల ముందు ఎయిర్‌పోర్టు‌కు చేరుకుంటే బెటర్‌. ట్రాఫిక్, సెక్యూరిటీ చెకింగ్‌, పార్కింగ్ వంటివి టైమ్ తినేస్తాయి. ఇక ఆన్‌లైన్ చెక్-ఇన్ తప్పక చేయాలి. ఎందుకంటే, ఎయిర్‌లైన్ చెక్-ఇన్ కౌంటర్లు 60 నిమిషాల ముందు మూసేస్తారు. ఆన్‌లైన్ చెక్-ఇన్ చేస్తే లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. టికెట్‌లో పేరు, పాస్‌పోర్ట్‌లోని పేరు ఒకటే ఉండేలా చూసుకోవాలి. మద్యం మత్తులో ఎయిర్‌పోర్టుకు వెళితే మాత్రం రిటర్న్‌ కావాల్సిందే. మద్యం మత్తులో ఉన్నట్టు కనిపించినా, అనారోగ్యంగా ఉన్నా విమానంలో ఎక్కనివ్వరు. ఎయిర్‌పోర్టు సిబ్బందితో గొడవపడ్డా బోర్డింగ్ రద్దు చేస్తారు. అదేవిధంగా టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో చెక్ చేయండి. కొన్నిసార్లు ఆన్‌లైన్ బుకింగ్ పేమెంట్ విఫలమయ్యే ఛాన్స్‌ ఉంటుంది. విమానానికి 24 గంటల ముందు బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకుంటే బెటర్‌. విమాన ఆలస్యాలు, గేట్ మార్పులు, బోర్డింగ్ టైమింగ్ అన్ని అప్‌డెట్స్ మొబైల్‌కి వస్తాయి. అందువల్ల ఫోన్‌లో డేటా ఆన్‌లో ఉంచుకోవాలి. చార్జింగ్ ఉండేలా, నోటిఫికేషన్లు ఆన్‌లో ఉండేలా చూసుకుంటే అప్‌డేట్స్‌ మిస్‌ అయ్యే ఛాన్స్‌ ఉండదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో మూడురోజుల కస్టడీ.. ఐ బొమ్మ రవి ఇంతకీ హీరోనా ?? విలనా ??

దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

TOP 9 ET News: జక్కన్న కిర్రాక్‌ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్‌ షేకవ్వడం పక్కా

Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు