బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామంటూ వచ్చి.. చివరికి

Updated on: Oct 01, 2025 | 4:26 PM

ప్రస్తుతకాలంలో అంతా స్మార్ట్...స్మార్ట్...స్మార్ట్‌.. ఏదైనా స్మార్ట్‌ వర్క్‌.. అంతే.. కష్టే ఫలి అనేది పాత సామెత.. ఇప్పుడు ఎంత స్మార్ట్‌ వర్క్‌ చేస్తే అంత ఫలితం బాగుంటుంది. అందుకే దొంగలు కూడా స్మార్ట్‌గా అప్‌డేట్‌ అయ్యారు. ఒకప్పుడు చోరీ చెయ్యాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు.. స్మార్ట్‌..స్మార్ట్‌ ఐడియాలతో ఇస్మార్ట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు.

అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఈ ఇస్మార్ట్‌ దొంగలు రోజుకో అవతారం ఎత్తుతారు. ఇటీవల బొంతలు కుట్టేవారుగా వీధుల్లో రెక్కీ నిర్వహించి రాత్రికి చోరీలకు పాల్పడుతున్న ముఠా గురించి నెట్టింట వైరల్‌ అయింది. ఇప్పుడు బంగారానికి మెరుగు పెడతామంటూ వచ్చి ఓ మహిళను బురిడీ కొట్టించి ఏకంగా 24 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… స్టీల్‌ప్లాంట్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రాజీవ్‌నగర్‌లోని ప్రశాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో అతని భార్య ఒంటరిగా ఉండడం చూసిన ఇద్దరు వ్యక్తులు జులై 15న ఆమె వద్దకు వచ్చారు. పాత బంగారు వస్తువులకు మెరుగు పెడతామని నమ్మించారు. దాంతో ఆమె తన వద్ద ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. వాటిని ఒక మట్టి కుండలో పెట్టి తెల్లని వస్త్రంతో కప్పి పదిరోజుల తర్వాత తీస్తే కొత్తవిగా మారతాయని చెప్పారు. వారి మాటలు నమ్మిన ఆ మహిళ పది రోజులు తర్వాత కుండకు కట్టిన క్లాత్‌ ఓపెన్‌ చేసి చూసి ఒక్కసారిగా షాకయ్యింది. అందులో బంగారు ఆభరణాలకు బదులు కల్లు ఉప్పు ఉంది. దీంతో మోసపోయానని గ్రహించినా ఆమె దువ్వాడ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. అన్నమయ్య జిల్లా పాతరాయచోటికి చెందిన రమణ, అనకాపల్లి జిల్లా మారేడుపల్లికి చెందిన చప్పిడి నూకరాజు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులిద్దరూ మామా అల్లుళ్లు కాగా, వారు జల్సాలకు అలవాటుపడి ఇలా జనాలను మోసం చేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు అన్నమయ్య జిల్లాలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాబోయే పదేళ్లలో ఉద్యోగాల స్వరూపంలో రానున్న పెను మార్పులు

కొత్త ఇంటి ఈఎంఐ కట్టడానికి ఖతర్నాక్‌ ఐడియా

అది నీ పిల్ల కాదే.. నా పిల్ల.. కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి

మహానందిని వీడని పాములు.. భయాందోళనలో భక్తులు

గురక ప్రాణాంతకమా.. నిపుణుల హెచ్చరిక