ప్రపంచంలో ఇంతకన్నా చిన్న పాము ఉండదేమో !! కానీ కాటు వేసిందా.. వీడియో

|

Feb 16, 2022 | 9:47 AM

సాధారణంగా పాములంటే భయపడని వారుండరు. అది చిన్నదైనా.. పెద్దదైనా.. పాము పామే... ప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి. అత్యంత భారీ సర్పాలు ఉన్నాయి.

సాధారణంగా పాములంటే భయపడని వారుండరు. అది చిన్నదైనా.. పెద్దదైనా.. పాము పామే… ప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి. అత్యంత భారీ సర్పాలు ఉన్నాయి. అలాగే అత్యంత చిన్న సర్పాలు కూడా ఉన్నాయి. నిత్యం నెట్టింట పాములకు సంబంధించిన ఎదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అలాగే తాజాగా ఓ పాముకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో పామును చూస్తే షాక్ అవుతారు. ఇందులో కనిపిస్తున్న నాగుపాము అత్యంత చిన్నగా ఉంది. నిజానికి మన చేతివేళ్లకంటే చిన్నగా ఉంది. అది నలుపు, తెలుపు రంగుల్లో ఉంది. పైగా అది పడగ విప్పి బుసలు కొడుతోంది.