నల్లమల అడవిలో తప్పిపోయిన మహిళ చివరికి ఎలా కాపాడారంటే వీడియో
పల్నాడు జిల్లాకు చెందిన 60 ఏళ్ల బోడీ బాయి నల్లమల అడవిలో దారి తప్పింది. 30 గంటలకు పైగా చిమ్మచీకటిలో పులుల సంచార ప్రాంతంలో గడిపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు, ఎస్సై సయ్యద్ సమీర్ బాషా గాలింపు చేపట్టారు. డ్రోన్ల సాయంతో కొండపై ఆమెను గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
పల్నాడు జిల్లా దుర్గి మండలం పోలేపల్లికి చెందిన 60 ఏళ్ల బోడీ బాయి నల్లమల అడవిలో తప్పిపోయారు. బంధువు ఒకరు చనిపోయారన్న వార్త విని మేకల దిన్నె తండాకు బయలుదేరిన ఆమె, అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తుండగా దారి తప్పింది. ఆమె మేకల దిన్నె తండాకు చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు అడవిలో వెతికి, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
