CM Shivraj Singh Chouhan: ముఖ్యమంత్రికి చల్లని టీ ఇచ్చిన అధికారికి షోకాజ్ నోటీసులు..

|

Jul 15, 2022 | 9:19 PM

ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అలాంటి వ్యక్తికి చల్లని చాయ్ అందించారు అక్కడి అధికారులు. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.


ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అలాంటి వ్యక్తికి చల్లని చాయ్ అందించారు అక్కడి అధికారులు. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాలను చూసుకున్న ఓ అధికారికి షోకాజ్ నోటిసులు అందించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజకీయ ప్రముఖులకు చల్లని టీ అందించిన వ్యవహారంలో.. సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు జూనియర్ సప్లై అధికారిని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి అందించిన టీ నాసిరకంగా ఉందని, పైగా అది చల్లగా అయిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఛాతర్‌పూర్‌ జిల్లా రాజ్‌నగర్‌ సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ డీపీ ద్వివేది.. జూనియర్‌ సప్లై ఆఫీసర్‌ రాకేశ్‌ కాన్హౌ ప్రోటోకాల్‌ ఉల్లంఘించారంటూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం జూలై 11న ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్‌ వీఐపీ​లాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు వేచిఉన్నారు. ఈ సమయంలో అధికారులు వారికి టిఫిన్‌తో పాటు టీ అందించారు. అయితే సీఎం, రాజకీయ నాయకులకు అందించిన టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూనియర్‌ సప్లై ఆఫీసర్‌కు షోకాజ్‌ నోటీసులు పంపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 15, 2022 09:19 PM