పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు

పెళ్లైన 3 నిమిషాలకే విడాకులు.. మంజూరు చేసిన కోర్టు

Phani CH

|

Updated on: Jul 26, 2024 | 1:07 PM

గల్ఫ్ దేశం కువైట్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లి పూర్తయ్యి భార్యాభర్తలుగా మారాక పెళ్లి వేడుక నుంచి వెళ్తున్న సమయంలో పెళ్లికూతురు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అయితే పక్కనే ఉన్న వరుడు ‘తెలివి తక్కువ దద్దమ్మ’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మాట విన్న పెళ్లి కూతురు ఆ క్షణమే అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

గల్ఫ్ దేశం కువైట్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లి పూర్తయ్యి భార్యాభర్తలుగా మారాక పెళ్లి వేడుక నుంచి వెళ్తున్న సమయంలో పెళ్లికూతురు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అయితే పక్కనే ఉన్న వరుడు ‘తెలివి తక్కువ దద్దమ్మ’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మాట విన్న పెళ్లి కూతురు ఆ క్షణమే అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. పెళ్లిని రద్దు చేసుకుంటున్నానని ప్రకటించి కోర్టుని ఆశ్రయించింది. లాంఛనమైన విచారణ ముగిసిన తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసింది. కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీనిని చెబుతుంటారు. నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన తాజాగా వైరల్‌గా మారింది. తాను ఒక వివాహానికి వెళ్లానని, అక్కడ పెళ్లికూతురుని వరుడు ఎగతాళి చేస్తూ గడిపాడని, ఆమె కూడా అప్పటి కువైట్ మహిళలా విడాకులు ఇచ్చి ఉండాల్సిందంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టడంతో నాటి ఘటన మరోసారి వైరల్ అయింది. గౌరవం లేకపోవడం పెళ్లిలో తొలి వైఫల్యమని సదురు వ్యక్తి పేర్కొన్నాడు. పెళ్లి మొదట్లోనే ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులను వదిలివేయడం మంచిదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జఫ్రానీ ఛాయ్‌ ను ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా ?? రేటెంతో తెలుసా ??

నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్‌ !!

స్పేస్‌లో వీకాఫ్‌ ఎంజాయ్ చేసిన సునీతా విలియమ్స్‌

ఆహారం కావాలంటే సైనికుల కోర్కెలు తీర్చాల్సిందే

Kangana Ranaut: చిక్కుల్లో కంగన.. ఇప్పుడు ఎంపీ గారి పరిస్థితేంటి మరి ??