కాకినాడలో వింత గొర్రె పిల్ల.. చూసేందుకు బారులు తీరిన జనం..

|

Nov 22, 2022 | 5:55 AM

ఈ సృష్టిలో చిత్ర విచిత్రాలు ఎన్నో.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఎప్పుడో ఇలాంటి విషయాలు చెప్పారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తారంటూ విద్యుత్ శక్తి గురించి వివరించారు.

ఈ సృష్టిలో చిత్ర విచిత్రాలు ఎన్నో.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఎప్పుడో ఇలాంటి విషయాలు చెప్పారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తారంటూ విద్యుత్ శక్తి గురించి వివరించారు. యంత్ర వాహనాలతో ఎద్దులు లేకుండానే బళ్లు నడుస్తాయన్నారు. వేపచెట్టు నుంచి పాలు స్రవిస్తాయన్నారు. అది నిజమయింది. తాజాగా కాకినాడలో అదే జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో రెండు తలల గొర్రె జన్మించింది. ఈ వింత గొర్రె పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలి వస్తున్నారు. రైతు పంపనబోయిన వెంకన్న పెంచుకుంటున్న గొర్రెకు రెండు తలల గొర్రె పిల్ల జన్మించింది. ప్రస్తుతం గొర్రె పిల్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రైతు వెంకన్న తెలిపారు. అయితే, వివిధ జన్యులోపాల వల్ల ఇలాంటి గొర్రె పిల్లలు జన్మించే అవకాశం వుందని పశు వైద్య నిపుణలు చెబుతున్నారు. కాగా సోషల్‌మీడియాలో ఈ గొర్రె పిల్లకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్

ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..

Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!

Follow us on