Viral Video: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏడుగురు.. ఏంటి భయ్యా ఇది..? వీడియో వైరల్..

Updated on: Aug 13, 2023 | 8:23 AM

సాధారణంగా బైక్‌పై ఒకరు లేక ఇద్దరు.. మహా అయితే ముగ్గురు జర్నీ చేస్తారు. ఇద్దరు వరకు ఓకే.. కానీ ముగ్గురు అయితే అది చట్టవిరుద్ధమని మనందరికీ తెలుసు. కానీ అక్కడ మాత్రం ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి, భయానికి గురి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ఓకే బైక్ పై ముగ్గురు కాదు నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణం చేస్తూ రయ్ మంటు రోడ్లపై చక్కర్లు కొట్టారు.

సాధారణంగా బైక్‌పై ఒకరు లేక ఇద్దరు.. మహా అయితే ముగ్గురు జర్నీ చేస్తారు. ఇద్దరు వరకు ఓకే.. కానీ ముగ్గురు అయితే అది చట్టవిరుద్ధమని మనందరికీ తెలుసు. కానీ అక్కడ మాత్రం ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణం చేస్తూ అందరిని ఆశ్చర్యానికి, భయానికి గురి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ఓకే బైక్ పై ముగ్గురు కాదు నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణం చేస్తూ రయ్ మంటు రోడ్లపై చక్కర్లు కొట్టారు. బైక్ నడిపే వ్యక్తి ముందు ఒకరు, అతని వెనక నలుగురు కూర్చున్నారు. ఏడో వ్యక్తి మాత్రం చూసే వారికే భయం కలిగేలా చివరి వ్యక్తి భుజాల పైన కూర్చున్నాడు. బైక్ ని రైడ్ చేసే వ్యక్తి కానీ.. బైక్ పై ఉన్న మిగతా ఆరుగురు వ్యక్తులు కానీ.. ఏ ఒక్కరూ మేజర్‌లలా లేరు. అందరూ 20 ఏళ్ల లోపు వారిలా కనిపిస్తున్నారు. అంటే కనీసం ఏ ఒక్కరికీ కనీసం బైక్ నడిపే లైసెన్స్ కూడా ఉండి ఉండదు. ఇలాంటి డేంజర్ ఫిట్ చేయడం సరైంది కాదు అని చూసిన వారు అంటున్నారు. టూ వీలర్ పై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జానార్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...