కిడ్నీలను ఇడ్లీల్లా అమ్మేశారు..వీళ్ల దందా..ఇంటర్నేషనల్..!

Updated on: Feb 02, 2025 | 1:53 PM

ఈజీ మనీ. ఇప్పుడిదో ట్రెండ్ అయిపోయింది. చొక్కా నలక్కుండా..చాలా సులువుగా డబ్బు సంపాదించేయాలి. ఇలా సంపాదించేందుకు కొందరు రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. దాదాపుగా అవన్నీ ఇవన్నీ అడ్డదారులే. ఇది తప్పు అని తెలియక కాదు. తెలిసి కూడా అలాగే చేస్తున్నారు. ఒక్కసారి ఇలా సులువుగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డాక.. కష్టపడడానికి మనసు ఒప్పదు.

  అక్రమంగా విక్రయిస్తూ లక్షలు సంపాదిస్తోంది ఓ ముఠా. పైగా ఇదంతా చేసింది డాక్టర్‌లే. ఇలాంటివి చేయడం తప్పు అని తెలిసినా ఏ మాత్రం పట్టించుకోకుండా.. అడ్డగోలుగా కిడ్నీ మార్పిడులు చేశారు. ఎవరో ఓ వ్యక్తి పోలీసులకు కాల్ చేసి సమాచారం అందించాడు. ఆ ఇన్‌ఫర్మేషన్‌తో ఆకస్మికంగా తనిఖీలు చేయగా…ఈ చీకటి సామ్రాజ్యం బయటపడింది.

Published on: Feb 02, 2025 01:52 PM