స్కానింగ్ సెంటర్లలో వికృత చేష్టలు.. రహస్యంగా వీడియోలు చిత్రీకరణ

|

Jun 02, 2024 | 9:48 PM

నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్‌లో వికృత చేష్టలకు తెరలేపారు. టెస్టుల కోసం వెళ్తే.. స్కానింగ్ సెంటర్‌లో దుర్మార్గానికి ఒడిగట్టాడు ల్యాబ్ అసిస్టెంట్. కామంతో కళ్లు మూసుకుపోయి.. కాబోయే తల్లులను కూడా వదల్లేదు ఈ కేటుగాడు. స్కానింగ్ కోసం వెళ్లే మహిళలను అశ్లీలంగా స్పై కెమెరాల్లో రికార్డ్ చేసి ఆ తర్వాత వారిని బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాడు. నిజామాబాద్‌లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కేంద్రంగా ఈ బాగోతం బయటపడింది.

నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్‌లో వికృత చేష్టలకు తెరలేపారు. టెస్టుల కోసం వెళ్తే.. స్కానింగ్ సెంటర్‌లో దుర్మార్గానికి ఒడిగట్టాడు ల్యాబ్ అసిస్టెంట్. కామంతో కళ్లు మూసుకుపోయి.. కాబోయే తల్లులను కూడా వదల్లేదు ఈ కేటుగాడు. స్కానింగ్ కోసం వెళ్లే మహిళలను అశ్లీలంగా స్పై కెమెరాల్లో రికార్డ్ చేసి ఆ తర్వాత వారిని బ్లాక్‌ మెయిల్ చేస్తున్నాడు. నిజామాబాద్‌లోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కేంద్రంగా ఈ బాగోతం బయటపడింది. ల్యాబ్ అసిస్టెంట్.. ప్రశాంత్ ముఠా ఈ వికృత చేష్టలకు పాల్పడుతోంది. వందలాది మహిళల వీడియోలు ప్రశాంత్ అండ్ కో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో.. ప్రశాంత్ ఆకృత్యాలు బయటకు వచ్చాయి. పోలీసులు ప్రశాంత్‌ అలియాస్ విలియమ్స్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా వైద్యశాఖ అధికారులు కూడా అయ్యప్ప స్కానింగ్ సెంటర్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దెబ్బతిన్న కిడ్నీ బదులు బాగున్న కిడ్నీ తొలగింపు

అమెరికాలో బొద్దింకల రాజధాని !! సర్వేలో వెల్లడి

రెయిలింగ్‌ పైనుంచి దూకుతున్న మొసలిని చూశారా ??

అరుదైన పామును పట్టుకున్నారు.. వీడియో వైరల్ చేసి బుక్‌ అయ్యారు

తాజ్ హోటల్లో వీధి కుక్క.. రతన్‌ టాటా ప్రేమకు నెటిజన్లు ఫిదా