Murunda Laddu: ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాది తర్వాతే..

|

Dec 02, 2024 | 6:32 PM

మనకు రకరకాల లడ్డూలు తెలుసు..బూందీ లడ్డు, బేసిన్‌ లడ్డు, తొక్కుడు లడ్డు, ఆఖరికి బందరు లడ్డు కూడా అందరికీ తెలుసు. అయితే ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి. కానీ సీజనల్‌ లడ్డూలు కూడా ఉంటాయి. అవి కేవలం కొన్ని సీజన్స్‌లో మాత్రమే దొరుకుతాయి. అలాంటి అరుదైన, అద్భుతమైన లడ్డూ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇది శీతాకాలంలో మాత్రమే దొరికే లడ్డూ.. ఇది ఆరోగ్యకరమైన లడ్డూ. ఇప్పడుగానీ మిస్‌ అయ్యారో.. మళ్లీ ఏడాదిదాకా మీకు దొరకదు. అయితే ఆ లడ్డూ ఏంటి? ఎక్కడ దొరుకుతుంది? అంత ప్రత్యేకత ఏంటి అనుకుంటున్నారా?

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఈ లడ్డూ దొరుకుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన లడ్డూ. ఈ లడ్డు తినడంవల్ల మన ఆరోగ్యనికి కూడా చాలా మంచింది. ఈ లడ్డుకోసం సంవత్సరం మొత్తం ఎదురుచూసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా..! జిల్లాలోని కంగ్టి, నారాయణఖేడ్, ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన స్వీట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.. దాని పేరే ‘మురుండా లడ్డు’ ఈ స్వీట్ సంవత్సరంలో శీతాకాలంలో కేవలం నవంబర్, డిసెంబర్ సమయంలో మాత్రమే ఈ లడ్డు అందుబాటులో ఉంటుంది..ఈ లడ్డును అందరూ తయారు చేయలేరు. తరతరాలుగా ఇందులో ప్రావీణ్యం సంపాదించిన కర్ణాటకలోని బీదర్ ప్రాంతంలోని ప్రత్యేక వంట వారితో దీనిని తయారు చేయిస్తారు. ఈ లడ్డుని సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేస్తారు. ఈ లడ్డు తయారికి చాలా సమయం, తీసుకుంటుంది.

ఈ మురుండా లడ్డూ తయారు చేయడానికి ప్రధానంగా చెరుకు రసం , కొబ్బరి పొడి , కాజూ , కిస్మిస్ , బాదం , నువ్వులు, నెయ్యి, వివిధ పప్పు దినుసులతో పాటు మక్క పిండిని ఉపయోగిస్తారు. అందుకే ఇవి చాలా రుచిగా ఉంటాయి. మురుండా లడ్డులో కాల్షియం , విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. మురుండా లడ్డు తయారీ అనేది ఓ కళ అని చెప్పాలి. దీని తయారీ ప్రక్రియలో అడుగడుగునా సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తారు. అందుకే ఇది సంవత్సరంలో 2 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నారాయణఖేడ్,కంగ్టిలోని మార్కెట్‌లోకి ఈ లడ్డు వచ్చినప్పుడు,దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది, దానిని కొనుగోలు చేయడానికి సంతలో ప్రజలు ఎగబడతారు…మార్కెట్‌లో మురుండా లడ్డు ధరలు ప్రతిసారి మారుతూ ఉంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.