క్లాస్‌ రూమ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న గర్ల్స్‌.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

|

Sep 03, 2022 | 9:49 AM

స్కూలుకు వెళ్లి చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ.. స్నేహంగా మెలగాల్సిన విద్యార్ధులు వైరానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు.

స్కూలుకు వెళ్లి చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ.. స్నేహంగా మెలగాల్సిన విద్యార్ధులు వైరానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. తాము క్లాస్‌ రూమ్‌లో ఉన్నామన్న సంగతి మర్చిపోయి సిగపట్లు పడుతున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ప్రైవేట్ స్కూల్‌ గర్ల్స్‌ ఒకరి నొకరు జుట్లు పట్టుకుని క్లాస్‌ రూమ్‌లో కొట్టుకున్నారు. తోటి విద్యార్థులు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో జరిగింది ఈ గర్ల్స్‌ఫైటింగ్‌ సీన్‌. స్కూల్‌ యూనిఫాంలో ఉన్న ముగ్గురు బాలికలు ఏం జరిగిందో ఏమో కానీ.. ఉన్నట్టుండి ఒకరి జుట్టు మరొకరు పట్టుకున్నారు. ఆపై చేతులతో కొట్టుకున్నారు. అయితే ఆ క్లాస్‌లోని మిగతా బాలికలు సర్దిచెప్పి, వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకుండా సిగపట్లు కొనసాగించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్లామర్ దుస్తులతో పాఠాలు చెబుతోన్న టీచర్ !! ఏకాగ్రతగా వింటున్న స్టూడెంట్స్… చివరికి ఏమైందంటే

ఆపదలో ఉన్న స్నేహితుడి కోసం తాబేలు ఏం చేసిందో చూడండి !! నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

టికెట్లు క్యాన్సిల్‌ చేసినా అదనంగా 5 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే !!

భూమి తిరగడం ఎప్పుడైనా చూశారా.. అద్భుతమైన వీడియో

అందుకే విరాట్‌ Attitude నాకు నచ్చుతుంది

 

Published on: Sep 03, 2022 09:49 AM