చెప్పులతో స్కూల్‌కు.. ప్రిన్సిపాల్ దాడిలో విద్యార్థిని
చెప్పులు వేసుకుని స్కూల్‌కు వచ్చిన విద్యార్థిని చెంపపై ప్రిన్సిపాల్ కొట్టింది. నాటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో విద్యార్థిని కుటుంబం, గ్రామస్తులు రోడ్డును దిగ్బంధించి ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు. జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బార్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్కూల్‌లో దివ్య కుమారి 12వ తరగతి చదువుతోంది.
ఒకరోజు ఆమె బూట్లకు బదులుగా చెప్పులు ధరించి స్కూలుకు వచ్చింది. స్కూలులో జరిగే అసెంబ్లీకి అలాగే హాజరైంది. దీంతో..డ్రెస్ కోడ్ పాటించలేదని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ అందరి ముందు తిట్టింది. అంతేకాక ఆమె చెంపపై గట్టిగా కొట్టింది. ఈ సంఘటన తర్వాత విద్యార్థిని దివ్య తొలుత బాగానే కనిపించింది. ఆ తర్వాత ఆమె మానసిక ఒత్తిడికి, అవమానానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు డాల్టన్‌గంజ్‌లోని ఆసుపత్రిలో దివ్యకు ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత రాంచీలోని రిమ్స్‌కు ఆమెను రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న దివ్య అక్టోబర్ 14న మరణించింది. మరోవైపు విద్యార్థిని దివ్య మరణానికి స్కూల్ ప్రిన్సిపాల్ మానసిక వేధింపులు కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రధాన రహదారిని దిగ్బంధించారు. పోలీసులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకున్నారు. దివ్య కుటుంబాన్ని సముదాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్
48 ఏళ్ల నాటి కేసులో 71 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
పార్టీ చేసుకున్న యువతీయువకులు.. అర్ధరాత్రి షాకింగ్ సీన్.. చివరకు
