కాపాడాలంటూ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్.. తర్వాత అంతా షాక్ వీడియో
గుజరాత్‌లో పరువు హత్య జరిగింది. 18 ఏళ్ల అమ్మాయి మర్డర్ కేసులో తండ్రే హంతకుడు అని పోలీసులు తేల్చారు. బనస్కాంత జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రికా చౌదరీ అనే 18 ఏళ్ల అమ్మాయి నుంచి ఆమె ప్రియుడు హరీశ్ చౌదరీ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. తనను కాపాడాలి అంటూ ఆ మెసేజ్‌లో ఉంది. కానీ ఆ రోజు రాత్రే చంద్రిక ప్రాణాలు విడిచింది. ఆమె సహజ కారణాల వల్ల మరణించినట్లు భావించారు.
ఇంట్లో వాళ్లు ఎవరికీ తెలియకుండానే అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం ఆమె సోదరుడికి కూడా చంద్రిక విషయాన్ని చెప్పలేదు. కానీ ఆమె ప్రియుడు హరీశ్ చౌదరీకి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రిక పంపిన మెసేజ్‌లను పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు. తండ్రి సేధాబాయ్ పటేల్, చిన్నాన శివభాయ్ పటేల్ ఆ హత్య చేసినట్లు తేలింది. తారడ్‌లోని థాంటియాలో ఈ మర్డర్ జరిగింది. ఈ కేసులో ఇదర్ని అరెస్టు చేశారు. తండ్రి పరారీలో ఉన్నట్లు ఏసీపీ సుమన్ నాలా తెలిపారు.హరీశ్, చంద్రిక.. కొన్నాళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నారు. కానీ ఆమె కుటుంబం హరీశ్‌ను వ్యతిరేకించింది. చంద్రికను మరొకరి ఇచ్చి పెళ్లి చేయాలని భావించింది. ఈ విషయాన్ని హరీశ్‌కు ఆ అమ్మాయి పలుమార్లు చెప్పింది. తన ఫ్యామిలీ నుంచి దూరంగా తీసుకువెళ్లాలని జూన్ 24వ తేదీన ఆమె హరీశ్‌ను వేడుకుంది. వాస్తవానికి అంతకుముందు ఇద్దరూ కుటుంబానికి దూరంగా వెళ్లిపోయారు.
మరిన్ని వీడియోల కోసం :