అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో
సౌదీ అరేబియా ఎడారి ప్రాంతాల్లో అరుదైన మంచు వర్షం కురిసింది, రోడ్లు తెల్లటి తివాచీలా మారాయి. స్థానికులను ఆశ్చర్యపరిచిన ఈ పరిణామం, దేశంలో వాతావరణ మార్పులకు సంకేతం. భారీ వర్షాలు, వరదల అనంతరం వచ్చిన ఈ మంచు, రాబోయే రోజుల్లో ప్రతికూల వాతావరణంపై సౌదీ వాతావరణ శాఖ హెచ్చరికలను బలపరుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సౌదీ అరేబియా అనగానే మనకు ఎడారులు, వేడి వాతావరణం గుర్తుకొస్తుంది. కానీ, అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎడారి దేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు, ఇళ్లు, వాహనాల పైకప్పులు మంచుతో పూర్తిగా కప్పబడిపోయాయి. రోడ్లన్నీ తెల్లటి తివాచీ పరిచినట్లు కనువిందు చేస్తున్నాయి. ఈ ఊహించని మంచు వర్షాన్ని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల సౌదీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. తాజాగా మంచు కురవడం అక్కడి వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. దేశంలో రానున్న రోజుల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అండమాన్ నికోబార్ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్
ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
ఎంత పెద్ద నేరం జరిగినా పోలీసులకి చెప్పరు !! ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం అమలు
12 ఏళ్లకు మించి బతకడన్నారు… కట్ చేస్తే.. వేలంలో ఆ క్రికెటర్ రూ.25 కోట్ల ధర పలికాడు
