సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్‌.. పండక్కి ఊరెళ్లేదెలా ??

Updated on: Dec 06, 2025 | 2:29 PM

సంక్రాంతి పండుగకు ఇంకా నెలరోజులు ఉన్నా, రైలు టిక్కెట్లు పూర్తిగా నిండిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు టిక్కెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సమయంలో రద్దు చేసిన కాచిగూడ-టాటానగర్, కాచిగూడ-కాకినాడ వంటి ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. రైలు టిక్కెట్ల కొరతతో పండుగ ప్రయాణం కష్టంగా మారింది.

సంక్రాంతికి ఇంకా నెల రోజుల పైనే ఉంది. కానీ పండక్కి ఊరెళ్లే వారి కష్టాలు ఎప్పుడో మొదలయ్యాయి. రైళ్లలో అప్పుడే సీట్లు నిండిపోయాయి. పండుగను తమ సొంతూళ్లలో జరుపుకోవడానికి నగరవాసులు రెండు నెలల ముందుగానే టిక్కెట్లను రిజర్వేషన్‌ చేయించుకున్నారు. మూడు రోజుల పాటు జరుపుకొనే సంక్రాంతి పండుగకు టిక్కెట్లు దొరకని పరిస్థితి. చివరి నిమిషంలో ఎవరైనా టిక్కెట్లు రద్దు చేసుకోకపోతారా, తమకు దొరక్కపోతాయా అనే ఆశాభావంతో ఉన్నారు. సంక్రాంతిని ఏపీలో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. నగరంలో స్థిరపడ్డ వారు పండగను తమ స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళుతుంటారు. దీంతో రైళ్లకు డిమాండ్‌ పెరుగుతుంది. ప్రైవేట్‌ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సు ఛార్జీలతో పోల్చుకుంటే టిక్కెట్‌ ధరలు తక్కువే. దీంతో పలు రైళ్లలో పండుగకు ముందుగానే టిక్కెట్ల రిజర్వేషన్‌ అయిపోయింది . కరోనా సమయంలో రద్దు చేసిన కాచిగూడ-టాటానగర్‌ రైలును నేటికీ పునరుద్ధరించలేదు. ఈ రైలు కాచిగూడ నుంచి గుంటూరు, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా టాటానగర్‌ వెళ్లేది. దీనికి నగరవాసుల నుంచి చాలా డిమాండ్‌ ఉండేది. ప్రత్యేకంగా నడిపిన కాచిగూడ-కాకినాడ రైలును నిలిపివేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టాటానగర్, కాకినాడ రైళ్లను పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్‌ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైలులో కొత్త మార్పులు..

East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు

Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??

అవతార్ 3 థియేటర్లలో మహేష్‌ !! హాలీవుడ్‌లో మార్కెట్‌ పై జక్కన్న మాస్టర్ ప్లాన్