Sanitation Worker Saved a Boy: స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. కొన్ని వీడియో లు చూస్తుంటే మంచితనం, మానవత్వం ఇంకా ఉంది కనుకనే ప్రపంచంలో ఎన్ని సంఘటనలు జరిగినా మనిషి ప్రయాణం ముందుకు సాగిపోతుంది అనిపిస్తుంది. రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురికావాల్సిన ఓ బాలుడుని కాపాడిన ఓ పారిశుధ్య కార్మికుడుపై నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తుంది.
రెక్స్ చాప్‌మన్ అనే వ్యక్తి తన ట్విట్టర్ లో పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బ్రెజిల్‌లోని రోలాండియాలో ఈ సంఘటన జరిగినట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఒక వీధిలో తాత పొరపాటున ఇంటి గేటు తెరచివుంచాడు. దీంతో లూకాస్ అనే ఓ చిన్న బాలుడు వీధి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఒక చెత్త ట్రక్ రావడం చూసిన బాలుడు.. అది వెళ్లెవరకూ ఆగి.. వెంటనే రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు.. అయితే ఆ సమయంలో వీధికి కుడివైపునుంచి ఓ వాహనం రావడాన్ని ఆ బాలుడు గమనించలేదు. దీంతో రోడ్డు దాటడానికి ప్రయాణిస్తున్నాడు.. అప్పుడు అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికుడు లూకాస్‌ని గమనించి.. వెంటనే స్పందించి.. పిల్లవాడిని పక్కకి లాగేశాడు. బాలుడు పరిగెత్తకుండా ఆపాడు. దీంతో ప్రమాదం తప్పింది.
ఈ వీడియో ఇప్పటికే ఒక మిలియన్ వ్యూస్ ని, 60,000 లైక్ లను దక్కించుకుంది. పారిశుధ్య కార్మికుడిని హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అతడు బాలుడి జీవితాన్ని కాపాడాడు.. అంతేకాదు.. ఏదైనా జరగానికి జరిగి ఉంటె.. ఆ డ్రైవర్ పడే బాధ వర్ణనాతీయం.. కనుక బాలుడిని రక్షించి ఆ డ్రైవర్ ను కూడా కాపాడినట్లు లెక్క అంటూ ఇంకొక నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
If you’ve already seen a sanitation worker save a little boy’s life today just keep on scrolling… pic.twitter.com/lVG44aSnco
— Rex Chapman?? (@RexChapman) September 5, 2021
Also Read: Jeevita Rajasekhar: ఎక్కడ ఏమి జరిగినా చిరు-రాజశేఖర్‌లు అంటారు.. అదంతా గతం అంటున్న జీవితారాజశేఖర్..