బయటపడ్డ సంగమేశ్వర ఆలయ గోపురం

|

Dec 06, 2024 | 8:28 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే సప్తనదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరాలయం. కృష్ణానది వరద జలాల్లో కార్తీక మాసం చివరి రోజున సప్త నదుల సంగమేశ్వర కలశం బయటపడింది. ఏడాదిలో 8 నెలలు నీటిలో ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. మిగిలిన 4 నెలలు.. ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఉండే ఈ ఆలయం.. ప్రాజెక్టు నిండితే నీటిలో మునిగిపోతుంది.

జలాశయంలో నీరు క్రమంగా తగ్గిపోతుండటంతో ఆలయ శిఖర భాగం బయటపడింది. శ్రీశైలం జలాశయంలో రోజురోజుకు కృష్ణా జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. కుడి ఎడమల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం జలశయంలో 864.8 అడుగుల నీటిమట్టానికి కృష్ణా జలాలు చేరాయి. ఇప్పుడు జలాశయంలో నీరు తగ్గడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం బయటపడింది. కార్తీక మాసం చివరి రోజున ఆలయ గోపుర కలశం బయటపడింది. దీంతో ఈ కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపుర కలశానికి సంధ్యా హారతి ఇచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరికాసేపట్లో తాళి కడతాడనగా పెళ్లి మండపాన్ని ధ్వంసం చేసిన కుక్క

అంతరిక్ష వ్యర్థాలతో పెను ప్రమాదం

అపచారం అపచారం.. గర్భగుడిలో కేక్ కటింగా ??

ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా

చిల్గోజా నట్స్‌ తెలుసా ?? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు