Foreigners Love marriage: వారెవ్వా.. రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి.. కన్యాదానం చేసి పెళ్లి చేసిన ఇండియన్స్..

ప్రేమ హద్దులు దాటింది.. ఖండాలే దాటేసింది. ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడతారు. యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడారు. కానీ యుద్ధంలోనే పుట్టిన ప్రేమను సరిహద్దులు దాటి పెళ్లితో గెలిపించుకున్నారు.

Foreigners Love marriage: వారెవ్వా.. రష్యా అబ్బాయి.. ఉక్రెయిన్ అమ్మాయి.. కన్యాదానం చేసి పెళ్లి చేసిన ఇండియన్స్..

|

Updated on: Aug 16, 2022 | 5:33 PM


ప్రేమ హద్దులు దాటింది.. ఖండాలే దాటేసింది. ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడతారు. యుద్ధం చేయాల్సి వచ్చినా వెనకడారు. కానీ యుద్ధంలోనే పుట్టిన ప్రేమను సరిహద్దులు దాటి పెళ్లితో గెలిపించుకున్నారు. తమ ప్రేమకు ఎలాంటి హద్దులు.. ఆంక్షలు లేవని నిరూపించుకుంది ఓ జంట. ఓవైపు తమ రెండు దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే మరో దేశమైన భారత్‌లో పెళ్లితో ఏకమయ్యారు. ప్రస్తుతం వీరి వివాహనికి సంబంధించిన పోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.రష్యాకు చెందిన సెర్గీ నోవికోవ్.. ఉక్రేయిన్ అమ్మాయి ఎలానా బ్రమోకా కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఈ రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరు తమ ప్రేమను గెలిపించుకోవడానికి యుద్ధానికి దూరంగా భారతదేశంలోని హిమచల్ ప్రదేశ్‏లోని ధర్మశాలలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరు ఏడాది కాలంగా ధర్మశాలలోనే నివసిస్తున్నారు. హిమచల్ ప్రదేశ్ కు చెందిన శర్మ.. అతని కుటుంబసభ్యులు వీరిద్దరి పెళ్లికి కన్యాదానంతోపాటు అనేక వివాహ ఆచారాలలో పాల్గోన్నారు. వీరి పెళ్లికి ఇతర విదేశీయులు అతిథులుగా హజరయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us