Dog Missing: కుక్క తప్పిపోయింది.. ఆచూకీ చెపితే రూ. 10 వేలు బహుమతి.! ఆనవాలు ఇవే..

|

Oct 16, 2022 | 5:15 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చరణ్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. వీరికి జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఉంది. ఏడు నెలల వయసు కలిగిన దీని పేరు సింబా. చరణ్ కుటుంబసభ్యులు ఎవరు గమనించని సమయంలో..


మాములుగా మనిషి ఆచూకీ తెలిపితే డబ్బులు ఇస్తామనే ప్రకటనలు ఎక్కువగా చూస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఓ యజమాని తన కుక్క ఆచూకీ తెలిపితే 10 వేల రూపాయలు ఇస్తామని నజరానా ప్రకటించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చరణ్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. వీరికి జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన పెంపుడు కుక్క ఉంది. ఏడు నెలల వయసు కలిగిన దీని పేరు సింబా. చరణ్ కుటుంబసభ్యులు ఎవరు గమనించని సమయంలో.. ఇంటి బయటకు వెళ్లిన సింబా కనిపించకుండాపోయింది. అప్పటి నుంచి సింబా కోసం చరణ్ ఫ్యామిటీ వెతుకుతూనే ఉన్నారు. కానీ దాని జాడ ఎక్కడ కనిపించడం లేదు. సింబా అంటే ఆ కుటుంబానికి ప్రాణమట. అది కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారని చరణ్ తెలిపాడు. తమ ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధను తాము ఇప్పుడు అనుభవిస్తున్నామని అన్నారు. సింబా తమ ఫ్యామిలీ మెంబర్ అని.. అందుకే దాని ఆచూకీ తెలిపిన వారికి పది వేల రూపాయల నజరానా ప్రకటించామని.. ఆచూకీ తెలిపితే కచ్చితంగా ఆ డబ్బు ఇస్తామని చెప్పుకొచ్చారు. శునకం ఆచూకీ కోసం గాలిస్తూ సోషల్ మీడియా లోనూ పోస్టులు పెడుతున్నాడు చరణ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Published on: Oct 16, 2022 05:15 PM