మాల్‌లో కుక్కను తెచ్చిన అమ్మాయి.. కుక్కను చూసి జనం షాక్‌

Updated on: Jun 19, 2025 | 6:00 PM

ఓ అమ్మాయి మాల్‌కి తన కుక్కను వెంటబెట్టుకుని షాపింగ్‌కి వచ్చింది. ఇది చూసిన షాపర్లు, మాల్‌కి వచ్చిన ప్రజలు వాళ్ల పనులు ఆపుకుని మరీ ఆశ్చర్యంతో ఆ కుక్కను చూస్తూ, ఫోన్లలో వీడియోలు తీస్తూ ఆ కుక్కను గమనించారు. ఆశ్చర్యపోవడానికి ఆ కుక్కలో అంతా స్పెషలిటీ ఏముందని అనుకుంటున్నారా! నిజంగానే అది ప్రత్యేకమైంది.

ఎందుకంటే.. అది రియల్ డాగ్ కాదు, రోబో డాగ్! ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. టెక్సాస్‌లో ఉన్న సాన్ ఆంటోనియో నగరంలోని రివర్‌సెంటర్ మాల్‌కు ఓ అమ్మాయి రోబో డాగ్‌ను తీసుకుని వచ్చింది. అమ్మాయి కుక్కకు లీష్‌ .. అంటే పెంపుడు జంతువుల మెడకు కట్టే గొలుసు లాంటిది కట్టి నడిపిస్తుండటం వీడియోలో చూడొచ్చు. ఇక కుక్క శరీరం మెటల్‌తో తయారై ఉంది, కానీ నడక, తల తిప్పడం, అటు ఇటు తిరిగే మోమెంట్స్ అన్నీ నిజమైన కుక్కలా ఉన్నాయి. ఈ రోబో డాగ్ ఒక్కసారిగా మాల్‌లో ప్రత్యేక్షమవటంతో అక్కడి షాపర్లు, ప్రజల దృష్టిని ఆకర్షించింది. వారు ఈ దృశ్యాన్ని ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ టెక్నాలజీ మన జీవితాల్లోకి ఎంత వేగంగా ప్రవేశించనుందో స్పష్టంగా చూపిస్తోంది. రోబోలను కేవలం పరిశ్రమలకే పరిమితం చేయకుండా, వీటిని వ్యక్తిగత జీవితాల్లో పనులు చేసి పెట్టడానికి కొంత మంది ఉపయోగిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ

బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్.. ఫ్లైఓవర్‌ పై నుంచి దూసుకెళ్లిన కారు.. కట్‌ చేస్తే