Viral: దుకాణంలో దొంగను చావగొట్టిన సిక్కు ఎన్నారై.. అదిరిపోయే వీడియో.

|

Aug 13, 2023 | 10:14 PM

అమెరికాలోని దుకాణాల్లో దొంగతనాలు, సాయుధ దోపిడీల ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ ఘటనలు దుకాణ యజమానులు, చిల్లర వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అక్కడి కస్టమర్లు, సిబ్బంది, షాపు యజమానులు ఇలాంటి దాడులకు గురవుతున్నట్లు చూపించే అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా. తాజాగా మరో ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

కాలిఫోర్నియా లోని ఓ సిక్కు ఎన్నారై కి చెందిన 7-ఎలెవెన్ దుకాణంలోకి చొరబడిన ఓ వ్యక్తి దుకాణంలోని వీలైనన్ని ఎక్కువ ఉత్పత్తులను తన వెంట తెచ్చుకున్న పెద్ద చెత్తడబ్బాలోకి నింపుకుంటూ కనిపించాడు. అడ్డొచ్చిన దుకాణం యజమానిని కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో దొంగ జోలికి వెళ్లొద్దంటూ షాపులోని మరో వ్యక్తి యజమానిని హెచ్చరించాడు. అయితే, కళ్ల ముందే తన కష్టం దొంగలపాలవడంతో భరించలేకపోయాడు. ఓ పెద్ద కర్ర తీసుకొచ్చి దొంగను చావబాదాడు. ముందుగా ఆ దొంగను షాపులోని వ్యక్తి అడ్డగించి కదలకుండా కిందపడేశాడు. ఆ తర్వాత యజమాని దొంగపై కర్రతో పలుమార్లు దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సిక్కు ఎన్నారై ధైర్య సాహసాలను మెచ్చుకుంటు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Published on: Aug 13, 2023 10:03 PM