ఇకపై వాహనాలకు ఆ స్టిక్కర్ తప్పనిసరి వీడియో

Updated on: Sep 15, 2025 | 3:20 PM

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎదుటి వాహనం దగ్గరికి వచ్చే వరకు కనపడకపోవడంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లేదా నెమ్మదిగా వెళుతున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకూ కనిపించకపోవడంతో వాహనాలు ఢీకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాలు కావచ్చు.. సరుకు రవాణా చేసే భారీ వాహనాలు కావచ్చు.. అన్నిటికీ వెనక రిఫ్లెక్టింగ్‌ స్టిక్కర్లను అతికించడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు అధికారులు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలనూ పక్కాగా అమలు చేయనున్నామన్నారు. రిఫ్లెక్టింగ్‌ స్టిక్కర్ల వాడకాన్ని తప్పనిసరిగా అమలు చేసేందుకు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ,రాత్రి వేళ వాహనం స్పష్టంగా కనిపించేలా ఈ స్టిక్కర్‌ ఉండాలని వివరించారు. రిఫ్లెక్టర్ల పరిశీలనకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, మోటారు క్యాబ్‌లు, ఆటోలు, ఓమ్నీ బస్సులు, హైడ్రాలిక్‌ ట్రాలర్లు తదితర అన్ని వాహనాలకు వెనక భాగంలో ఇకపై రిఫ్లెక్టింగ్‌ స్టిక్కర్లు తప్పనిసరి చేశారు. రిఫ్లెక్టివ్‌ స్టిక్కర్లు, నంబరు ప్లేట్లు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, వీటిని తనిఖీ చేయడానికి క్యూఆర్‌ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, రవాణా శాఖ అధీకృత సంస్థలు మాత్రమే వీటిని సరఫరా చేయాలని ఉత్తర్వుల్లో నిర్దేశించారు.

మరిన్ని వీడియోల కోసం :

అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో

దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో

ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్‌ వీడియో

ఆపరేషన్‌ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో