సెల్ టవర్ ఎక్కిన RMP !! పోలీసులే కారణమట

Updated on: Aug 29, 2023 | 8:31 PM

అనంతపురం జిల్లాలో సెల్‌టవర్‌ ఎక్కి ఓ RMP డాక్టర్‌ హల్‌చల్‌ చేశాడు..పుట్లూరు మండలం కొండాపురంలో సైబర్‌ నేరగాళ్ల మోసానికి డబ్బులు పోగొట్టుకున్నాడు RMP డాక్టర్..ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్లాడు..అయితే అతడి కంప్లైంట్‌ తీసుకోకపోగా తనని అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ స్టేషన్‌ నుంచి స్పందనకు వెళ్లాడు..అక్కడ కూడా తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదని సెల్‌టవర్‌ ఎక్కి నిరసనకు దిగాడు.