భార్య వేధింపులతో నరకం చూస్తున్నా.. కాపాడండి బాబోయ్

Updated on: Mar 31, 2025 | 8:17 PM

ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు భార్య చేతిలో వేధింపులకు గురవుతున్నాడు. పోలీసులు అతడిని అెరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఏం చేయాలో పాలుపోని అతడు తన కథను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీ రిప్లింగ్ సహ-వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్..10 సంవత్సరాల క్రితమే దివ్యను పెళ్లి చేసుకున్నట్లు వివరించాడు. తమకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడని.. ప్రస్తుతం తన ఆస్తుల విలువ 10 బిలియన్ డాలర్లు అనీ భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా 86 కోట్ల రూపాయలు అని చెప్పుకొచ్చాడు.

అలాగే తాను భారత దేశపు నెంబర్ వన్ కోడర్‌గా రికార్డు సాధించినట్లు కూడా తెలిపాడు. అయితే తన భార్య దివ్య.. అనూప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు 6 నెలల క్రితమే గుర్తించినట్లు ప్రసన్న తెలిపాడు. ముఖ్యంగా అనూప్ భార్య అతడికి దివ్య చేసిన మెసేజ్‌లు, హోటల్ బుకింగ్ టికెట్లు వంటివి పంపగా.. తాను ఆ విషయం తెలుసుకున్నట్లు వివరించాడు. దీంతో భార్యపై విరక్తి కలిగి విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు స్పష్టం చేశాడు. అయితే దివ్య మాత్రం తనకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తే విడాకులు ఇస్తానని చెబుతూ చర్చలు జరుపుతూనే.. సింగపూర్ వెళ్లి తనపై కేసు పెట్టిందని అన్నాడు. అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి అవన్నీ అవాస్తవాలుగా గుర్తించి కేసు కొట్టేశారని ప్రసన్న పేర్కొన్నారు. ఆపై ఆమె అమెరికా వెళ్లి అక్కడ విడాకుల కోసం దరఖాస్తు చేసిందని.. ఎక్కువ డబ్బులు గుంజేందుకు తన కుమారుడిని కూడా యూఎస్ తీసుకెళ్లిందని చెప్పాడు. ఈ క్రమంలోనే తాను అంతర్జాతీయ పిల్లల అపహరణ కేసు దాఖలు చేశానని.. విచారణ జరిపిన న్యాయస్థానం 50/50 కస్టడీకి ఓకే చెప్పిందని ప్రసన్న వివరించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉగాది పంచాంగం 2025: కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ??

ఉగాది పంచాంగం 2025: కన్య రాశి వారికి ఈ ఉగాది నుండి ఉద్యోగాల పరంగా ఎలా ఉంటుందంటే ??

ఉగాది పంచాంగం 2025: వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది నుండి ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ??

శని గ్రహం చుట్టూ ఉండే రింగ్‌ మాయం! ఇది యుగాంతానికి సంకేతమా

వేదికపై వధూవరుల ఫోటో సెషన్‌.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి