Secunderabad: ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.!

|

Sep 01, 2024 | 11:53 AM

వేలాదిమంది ప్రయాణికులు.. ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్‌ఫామ్‌లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్‌ఫామ్‌లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది.

వేలాదిమంది ప్రయాణికులు.. ఎటువైపు నుంచి వస్తున్నారో, ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితి. వచ్చిపోయే రైళ్లతో ప్రమేయం లేకుండా ఎప్పుడు చూసినా.. ప్లాట్‌ఫామ్‌లు వందల మందితో కిక్కిరిసి కనిపిస్తాయి. కాస్త చీకటి పడితే చాలు.. ప్లాట్‌ఫామ్‌లపై గురకపెట్టి నిద్రలోకి జారుకునే వారెందరో… సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అంతా గందరగోళం. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా రూపుదిద్దుకొంటున్న సికింద్రా­బాద్‌ స్టేషన్‌ మరో ఏడాదిన్నరలో సరికొత్త రూ­పును సంతరించుకోనుంది. రూ.700 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. ఎయిర్‌పోర్ట్‌ తరహాలో భద్రతతో కూడిన ప్రాంగణంగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

సికింద్రాబాద్‌ స్టేషన్‌కు ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ వైపు, పదో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ఉన్న బోయిగూడ వైపు నుంచి ప్రవేశ మార్గాలున్నాయి. ఆధునికీకరణ తర్వాత కూడా ఈ రెండు కొనసాగుతాయి. ఈ రెండు మార్గాల్లో ఒక్కోవైపు రూ.3 కోట్ల వ్యయంతో భారీ బ్యాగేజీ స్క్రీనింగ్‌ మెషీన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులు నేరుగా ప్లాట్‌పామ్‌లపైకి చేరుకుంటున్నారు. కానీ, ఆధునిక స్టేషన్‌ అందుబాటులోకి వచ్చాక ఇది కుదరదు. టికెట్‌ పొందిన తర్వాత ప్రయాణికులు నేరుగా కాంకోర్స్‌ మీదుగా ప్రయాణికులు వేచి ఉండే హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడే వారు కూర్చోవాలి. లేదా.. షాపింగ్‌ చేసుకోవచ్చు. వారు వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫామ్‌ మీదకు రావటానికి పదిపదిహేను నిమిషాల ముందు అనౌన్స్‌మెంట్‌ ఇస్తారు. అప్పుడు మాత్రమే ప్రయాణికులను ప్లాట్‌ఫామ్‌ మీదకు అనుమతిస్తారు.

కచ్చితంగా బ్యాగేజీ చెకింగ్‌ ఉంటున్నందున.. ముందుగానే స్టేషన్‌కు రావాల్సి ఉంటుందన్న నిబంధన విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వారు కూడా లగేజీ చెకింగ్‌ పూర్తి చేసుకునే ప్లాట్‌ఫామ్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు ఉంటే ఎక్కుతారు.. లేదంటే వెనుదిరగాల్సిందే. ప్రపంచస్థాయి స్టేషన్‌లుగా ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు స్టేషన్లు మాత్రమే సిద్ధమవుతున్నాయి. అవి తిరుపతి, నెల్లూరు, సికింద్రాబాద్‌ మాత్రమే. ఇక జోన్‌ వ్యాప్తంగా మరో 119 స్టేషన్‌లను రూ. 5 వేల కోట్ల వ్యయంతో అమృత్‌భారత్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.