ఇదేం కక్కుర్తి రా నాయనా !! ఆ ఆర్డర్లు ఇచ్చే వారికి ఏసీ పనిచేయదట.. రెస్టారెంట్లో వింత కండీషన్

|

Jul 10, 2022 | 8:33 PM

తమ వ్యాపార వృద్ధి కోసం కొందరు వినూత్న పంథాను ఎంచుకోవడం సహజమే.. కేజీ చికెన్ కొంటే.. నాలుగు కోడిగుడ్లు ఉచితమన్న ప్రకటనలను చికెన్ షాపుల్లో మనం చూస్తూనే ఉంటాం..

తమ వ్యాపార వృద్ధి కోసం కొందరు వినూత్న పంథాను ఎంచుకోవడం సహజమే.. కేజీ చికెన్ కొంటే.. నాలుగు కోడిగుడ్లు ఉచితమన్న ప్రకటనలను చికెన్ షాపుల్లో మనం చూస్తూనే ఉంటాం.. హోటల్లో బిర్యానీ తింటే కోక్ లేదా పెప్సీ ఉచితమన్న ప్రకటనలు కూడా మీరు చూసే ఉంటారు. అయితే.. ఓ వ్యక్తి తన రెస్టారెంట్లో పెట్టుకున్న ఓ పోస్టర్‌ కస్టమర్లను విస్తుపోయేలా చేస్తోంది. అయితే. ఆ పోస్టర్‌ వెనుక బలమైన కారణం లేకపోలేదు. కొందరు చిన్న, చిన్న ఆర్డర్లు ఇచ్చి గంటల తరబడి ఏసీ రెస్టారెంట్లో గడపడంతో.. విద్యుత్ బిల్లుల ఖర్చు భరించలేక ఈ ‘కఠిన’ నిర్ణయానికి వచ్చాడు. ప్రస్తుతం ఆ రెస్టారెంట్ ఓనర్ పెట్టిన కండిషన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏం రాశారంటే.. ఎగ్ బుర్జి, కోడిగుడ్డు కర్రీ, ఎగ్ ఆమ్లెట్, 250 గ్రాముల చికెన్ పకోడీ ఆర్డర్లపై ఏసీ ఆన్ చేయమంటూ ఎలాంటి మొహమాటం లేకుండా కస్టమర్లకు తేల్చిచెప్పాడు. అంటే చిన్న ఆర్డర్లకు ఏసీ పనిచేయదని.. ఏసీ ఆన్ కావాలంటే భారీ ఆర్డర్లు ఇవ్వాల్సిందేనని చెప్పకనే చెప్పేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాంసాహార తినే మొక్కలను చూశారా !! వేటిని తింటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారంతే !!

Viral Video: చెప్పులు వేసుకుని మరీ.. దొంగతనం చేస్తున్న పిల్లి

రంగులు మార్చుకున్న ఆక్టోపస్‌ను మీరెప్పుడైన చూశారా ??

నౌకలో చిక్కుకున్న విదేశీయులు.. 22మంది రక్షించిన కోస్ట్‌ గార్డ్‌

Published on: Jul 10, 2022 08:33 PM