Dinosaur Eggs: మధ్యప్రదేశ్‌లో బయటపడ్డ డైనోసార్ల గుడ్లు..గుడ్లను పగలగొట్టి చూస్తే అందులో ఏముందో తెలుసా ??

|

Jun 20, 2022 | 9:59 AM

మధ్యప్రదేశ్‌లో భారీ సైజు డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ధార్ జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా వీటిని కనుగొన్నారు.

మధ్యప్రదేశ్‌లో భారీ సైజు డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ధార్ జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా వీటిని కనుగొన్నారు. ఇవి ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్లకు చెందిన గుడ్లని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గుడ్ల బయట, లోపలి నిర్మాణం చాలా అరుదైన‌దిగా ఉందని వారు పేర్కొన్నారు. ధార్ జిల్లాలోని బాగ్ ప్రాంతంలో బయటపడిన ఈ టైటానో సౌరిడ్ అనే జాతికి చెందిన డైనోసార్ గుడ్లుగా గుర్తించారు. సౌరోపాడ్ కుటుంబానికి చెందిన డైనోసార్‌లు ఇప్పటివరకు భూమి మీద నివసించిన అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి భారత భూభాగంలో సంచరిస్తుండేవి. ఇదిలా ఉంటే గతంలో మనదేశంలోని గుజరాత్, మధ్యప్రదేశ్, మేఘాలయలో వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిగిన సమయంలో ఈ డైనోసార్ల అస్థిపంజరాలు బయటపడ్డాయి. అయితే తాజాగా సౌరోపాడ్‌ జాతికి చెందిన డైనోసార్ల గుడ్ల దొరకడంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మొత్తతం 52డైనోసార్ల గుడ్లను కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుట్కా తో మ్యాగీ మేకింగ్ !! వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో.

లోకల్‌ ట్రైన్‌లో అమ్మాయిలు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి అబ్బాయిలు అందరు ఫిదా !!

ఒక్క కండోమ్‌ ప్యాకెట్ ధర రూ. 60 వేలు !! ఈ అసాధారణ పరిస్థితి ఎక్కడంటే ??

చనిపోయిన తండ్రి.. కూతురి పెళ్లిలో ప్రత్యక్షం..కంటతడి పెట్టిస్తున్న వీడియో

Strange Laws: వింత చట్టాలు !! స్నానం చేయక పోయినా… నవ్వినా.. జైలుకే !!

Published on: Jun 20, 2022 09:59 AM