పెళ్లికొచ్చి పిచ్చిపిచ్చిగా తన్నుకున్న అతిథులు !! కారణమేంటో తెలిస్తే షాకే !!
పెళ్లంటే అతిథులు, బంధువులతో ఎంతో సరదాగాసాగే వేడుక. వివాహ వేడుకల్లో ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. ఆ కోవకు చెందిన వీడియోలు ఇటీవల నెట్టింట బాగా హల్‌చల్ చేస్తున్నాయి.
పెళ్లంటే అతిథులు, బంధువులతో ఎంతో సరదాగాసాగే వేడుక. వివాహ వేడుకల్లో ఎన్నో సరదా సన్నివేశాలు జరుగుతుంటాయి. ఆ కోవకు చెందిన వీడియోలు ఇటీవల నెట్టింట బాగా హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ పెళ్లిలో అతిథులు కుర్చీలు బల్లలు విరిగేలా తన్నుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే వాళ్లలా ఎందుకు తన్నుకున్నారో తెలుసుకుందాం… పెళ్లికొచ్చి వధూవరులను ఆశీర్వదించి, విందు భోజనం చేసి వెళ్లాల్సిన అతిథులు విందు కార్యక్రమంలో బాహాబాహీకి దిగారు. భోజనంలో వడ్డించే అప్పడం కోసం అతిధులు రెండు వర్గాలుగా విడిపోయి గ్యాంగ్‌వార్‌ను తలపించేలా ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో లక్షన్నర విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయి. కేరళలోని అలప్పుజలోని ఓ వివాహ విందులో అప్పడం కోసం కుర్చీలు బల్లలు విరిగేలా తన్నుకున్నారు. ఆగస్టు 28 మద్యాహ్నం ఈ ఘటన జరిగింది. పెళ్లి విందులో వరుడి స్నేహితుల్లో ఓ వ్యక్తి మరో అప్పడం వేయాలని సర్వర్‌ను కోరాడు. అందుకు అతను నిరాకరించాడు. దాంతో ఆవ్యక్తి సర్వర్‌తో వాగ్వాదానికి దిగాడు. అదికాస్తా చినికిచినికి గాలివానలా మారి, పెళ్లికి వచ్చిన అతిధులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగారు. చైర్లు, టేబుల్స్‌తో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. గొడవకు దిగిన ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు తలదూర్చిన ఆడిటోరియం యజమానికూడా పాపం తన్నులు తిన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పడం చుట్టూ సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ హోరెత్తాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అప్పుడే పుట్టిన బిడ్డను చూడబోయిన తల్లి.. తీరా కనిపించిన దృశ్యానికి మైండ్ బ్లాంక్ !!
అందుకే కోతి చేష్టలు అనేది.. సేదతీరుతున్న పులులతో పరాచకాలు.. కట్ చేస్తే
కడుపుమాడ్చి పిల్లాడిని చంపిన తల్లి !! జీవిత ఖైదు విధించిన కోర్టు !!
‘బాహుబలి సమోసా’ ఛాలెంజ్.. మూడు నిమిషాల్లో పూర్తి చేస్తే భారీ బహుమతి
కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న 9 ఏళ్ల బాలిక.. ఏమైందని ఆరా తీయగా !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

