అందుకే కోతి చేష్టలు అనేది.. సేదతీరుతున్న పులులతో పరాచకాలు.. కట్ చేస్తే
ఇంటర్నెట్‌లో వన్యమృగాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోలద్వారా వన్యమృగాల జీవన శైలిని దగ్గర్నుంచి చూడగల్గడమేకాదు..
ఇంటర్నెట్‌లో వన్యమృగాలకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోలద్వారా వన్యమృగాల జీవన శైలిని దగ్గర్నుంచి చూడగల్గడమేకాదు.. వాటిని ఎంతగానో ఇష్టపడతారు నెటిజన్లు. అందుకే అలాంటి వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతుంటాయి. పాతదే అయినప్పటికీ ఓ కోతికి సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ ఇంటర్నెట్‌లో హల్‌చేస్తోంది. ఈ క్లిప్ లో ఓ కోతి చెట్టు కొమ్మను పట్టుకుని ఊగుతూ ఉంది. ఆ చెట్టు కింద కొన్ని పులులు సేద తీరుతూ ఉన్నాయి. అయితే ఆ కోతి చేసిన చిలిపి పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చెట్టుపై వేలాడుతున్న కోతి కింద ఉన్న పులిని కొట్టడం, తోక పట్టుకుని లాగడం చేస్తుంది. కోతిని పట్టుకుందామని పులులు ప్రయత్నిస్తే అది వెంటనే చెట్టు ఎక్కేస్తుంది. ఇక చేసేదేమీ లేక పులులు దూరంగా ఉన్న పొదల్లోకి వెళ్లిపోయాయి. అయినా కోతి తన చిలిపి పనులను మానకోలేదు. అక్కడికి కూడా వచ్చి పులి చెవి, తోక పట్టుకుని లాగుతుంది. ఇలా చాలా సమయం వరకు పులిని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోను లక్షలమంది వీక్షించగా వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ షేర్ చేస్తున్నారు. కోతి పులితో పెట్టుకోవడం అసరమా.. ఒక్కసారి పులి గాండ్రించిందంటే కోతిపని ఢమాల్.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కడుపుమాడ్చి పిల్లాడిని చంపిన తల్లి !! జీవిత ఖైదు విధించిన కోర్టు !!
‘బాహుబలి సమోసా’ ఛాలెంజ్.. మూడు నిమిషాల్లో పూర్తి చేస్తే భారీ బహుమతి
కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న 9 ఏళ్ల బాలిక.. ఏమైందని ఆరా తీయగా !!
World Biggest Temple: ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆలయం ఎక్కడా చూసి ఉండరు
అతిపెద్ద గ్రహాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

