‘బాహుబలి సమోసా’ ఛాలెంజ్.. మూడు నిమిషాల్లో పూర్తి చేస్తే భారీ బహుమతి
స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్‌కి సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో దుకాణదారులు పెట్టే ఫుడ్ ఛాలెంజ్ పట్ల చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.
స్ట్రీట్ ఫుడ్ ఛాలెంజ్‌కి సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో దుకాణదారులు పెట్టే ఫుడ్ ఛాలెంజ్ పట్ల చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. నిర్వాహకులు చెప్పిన నిర్ణీత సమయంలో చెప్పిన ఫుడ్ ఛాలెంజ్ పూర్తి చేసిన వ్యక్తికి భారీ బహుమానం ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సమోసా ఛాలెంజ్ ఒకటి తెరమీదకు వచ్చింది. మూడు కిలోల సమోసాను, పెట్టిన గడువులోగా తినేసి, ఓ యువకుడు భారీ నగదు బహుమతి గెలుపొందాడు. ఈ బాహుబలి సమోసా ఈటింగ్ ఛాలెంజ్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడి ముందు 3 కిలోల సమోసా పెట్టి, ఆ సమోసాను తినడానికి అతనికి 5 నిమిషాల సమయం కేటాయించారు. విజిల్ మోగగానే అతడు సమోసా తినడం మొదలుపెట్టాలి. ఈ ఛాలెంజ్‌లో కుర్రాడు గెలుస్తాడా..? లేదా అని చాలాసార్లు అనిపించింది. అయితే చివరికి అతడు ఛాలెంజ్‌లో నెగ్గాడు. అతి కష్టం మీద 3 కిలోల సమోసా తినేశాడు. దాంతో ఆ దుకాణదారురు నోరెళ్ల బెట్టి చూస్తుండిపోయాడు. పెద్ద బైట్లుగా తింటూ..అతడు 5 నిమిషాల్లో 3 కిలోల సమోసాను పూర్తి చేశాడు. డబ్బులు చెల్లించే విషయానికి వస్తే దుకాణదారుడు ఏదో మాటవరసకు చెప్పేశాడు.. బాలుడు ఈ ఛాలెంజ్‌ను గెలవలేడని అతడు భావించాడు. కానీ, అతను అనుకున్నది ఫేయిల్ కావటంతో.. చివరికి ఆ అబ్బాయికి 11 వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఈ వీడియో ఓ ప్రకుఖ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. వీడియో చూసిన నెటిజన్లు ‘అవతలివాళ్లను తక్కువగా అంచనా వేస్తే ఇలాగే చిక్కుల్లో పడతారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్న 9 ఏళ్ల బాలిక.. ఏమైందని ఆరా తీయగా !!
World Biggest Temple: ప్రపంచంలోనే ఇంత పెద్ద ఆలయం ఎక్కడా చూసి ఉండరు
అతిపెద్ద గ్రహాన్ని కనుగొన్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్..
చికెన్ వింగ్స్ తిని బోన్స్ డెలివరీ చేసిన బాయ్ !! అందులో ఓ లెటర్ కూడా..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్‌చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

